Sajjala On PRC: పీఆర్సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పీఆర్‌సీపై మళ్లీ కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. పీఆర్‌సీ నివేదికలో స్వల్ప సవరణలు చేస్తున్నామన్న ఆయన.. ప్రక్రియ రేపట్నుంచి వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని.. ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిట్‌మెంట్ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోందన్నారు. బడ్జెట్‌పై పడే పీఆర్‌సీ భారం అంచనా వేస్తున్నామని.. అందువల్లే పక్రియ ఆలస్యమవుతుందని చెప్పారు.
"పీఆర్‌సీ ప్రకటనకు మరికొంత సమయం పట్టవచ్చు. సీఎం ఆదేశాల మేరకు పీఆర్‌సీపై మళ్లీ కసరత్తు చేస్తున్నాం. మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉద్యోగులు అసంతృప్తి చెందకూడదన్నదే సీఎం ఉద్దేశం. ఫిట్‌మెంట్ పెంచడమే లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం జగన్ చర్చలు ఉంటాయి" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు
ఇదీ చదవండి: Good news for drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు