ETV Bharat / city

మార్ఫింగ్‌ లేదని తేలితే.. అత్యంత కఠిన చర్యలు: సజ్జల - sajjala latest news

Sajjala On Mp Gorantla Issue: ఏపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌.. నగ్న వీడియోలో ఎలాంటి మార్ఫింగ్‌ లేదని తేలితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే పార్టీ సహించదని తెలిపారు.

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి
author img

By

Published : Aug 4, 2022, 7:06 PM IST

Sajjala On Mp Gorantla Issue: ఆంధ్రప్రదేశ్​ వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్​పై వచ్చిన ఆరోపణల విషయమై​ ముఖ్యమంత్రితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి భేటీ అయ్యారు. ఎంపీ మాధవ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని.. దానిపై విచారణ జరుగుతోందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మాధవ్ ఖండిస్తున్నారని.. అది మార్ఫింగ్‌ వీడియో అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అతని ఫిర్యాదుపై పోలీసు విచారణ జరుగుతోందని.. ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. మహిళలను కించపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే పార్టీ సహించదని స్పష్టం చేశారు.

"ఎంపీ గోరట్ల మాధవ్​కు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోపై పోలీస్​స్టేషన్​లో మాధవ్ ఫిర్యాదు చేశారు. విచారణలో తెలియాల్సి ఉంది. దాన్ని బట్టి మార్ఫింగ్ కాదు అని తెలిస్తే చర్యలు తీసుకుంటాం. దర్యాప్తు సాగుతుంది. ఆరోపణలను ఎంపీ మాధవ్ ఖండిస్తున్నారు. నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం." -సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వ సలహాదారు

మార్ఫింగ్‌ లేదని తేలితే.. అత్యంత కఠిన చర్యలు: సజ్జల

ఇవీ చదవండి: పోలీస్​ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ప్రారంభించిన కేసీఆర్.. నేటి నుంచి అందుబాటులోకి..

తైవాన్​ను చుట్టుముట్టిన చైనా.. భారీ ఎత్తున సైనిక డ్రిల్స్.. యుద్ధం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.