ETV Bharat / city

'మిగిలి ఉన్న యాసంగి పంటను వెంటనే కొనుగోలు చేయాలి'

రాష్ట్రంలో వానాకాలం పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత కిసాన్ సభ సీఎం కేసీఆర్​కు లేఖ రాసింది. ఇంకా రైతుల దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉన్న 30 లక్షల టన్నులు ధాన్యం మొత్తాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. వానా కాలం సంబంధించి విత్తనాలు, ఎరువుల వినియోగం, రుణ అవసరాలు, నిషేధిత క్రిమిసంహారక మందుల జాబితాలు, ఏ జిల్లాలో.. ఏ మండలంలో ఏ పంటలు వేయాలో సూచిస్తూ వార్షిక ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

RYTHU SANGAM
తెలంగాణ రైతు సంఘం
author img

By

Published : May 30, 2021, 4:09 AM IST

రాష్ట్రంలో వానాకాలం పంటల ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది.నేడు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విత్తనాలు, ఎరువుల ప్రణాళిక, రైతుబంధు, ఇతరు సంస్థాగత రుణాలు వంటి అంశాలు విస్తృతంగా చర్చించి రైతుల ముందుకు ఉంచాలంటూ సూచించింది. ఈ మేరకు అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగారెడ్డి, తీగల సాగర్... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

జూన్‌ నుంచి వానాకాలం పంటల సీజన్‌ ప్రారంభమవుతున్న దృష్ట్యా.. యాసంగి ధాన్యాన్ని 8 నాటికి కొనుగోలు పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో యాసంగిలో 1.35 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. 67 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ ప్రకటించిన తరుణంలో... ఇంకా రైతుల దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉన్న 30 లక్షల టన్నులు ధాన్యం మొత్తాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. వానా కాలం సంబంధించి విత్తనాలు, ఎరువుల వినియోగం, రుణ అవసరాలు, నిషేధిత క్రిమిసంహారక మందుల జాబితాలు, ఏ జిల్లాలో, ఏ మండలంలో ఏ పంటలు వేయాలో సూచిస్తూ వార్షిక ప్రణాళిక రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

రైతుబంధు పెట్టుబడి జూన్‌ 5 లోపు అందించాలని కోరారు. ఇప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు లేవనే సాకుతో 10 లక్షల మంది పేద రైతులకు రైతుబంధు వర్తింపజేయడం లేదని... వాస్తవ సాగు అర్హతను రెవెన్యూ వ్యవస్థ ద్వారా గుర్తించి సాయం అందజేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయ రుణ ప్రణాళిక జూన్‌ 10 లోపు ప్రకటించాలన్నారు. ప్రస్తుతం బ్యాంకులు రుణాలు ఇవ్వకపొవడంతో రైతులు 20,000 కోట్ల రూపాయలు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని... అవి తీర్చలేక అత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖ తరుపున నాణ్యమైన విత్తనాలను ధృవీకరిస్తూ మండల స్థాయిలో కరపత్రాలు వేసి పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వ గోదాములు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలు రైతులకు విక్రయించాలని చెప్పారు. క్రిమిసంహారక మందులు, జీవ ఎరువుల పేరిట జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నేతలు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.