ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భధ్రతపై సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ... యాజమాన్యం ఇప్పటి వరకు గైడ్లైన్స్ ఇవ్వకపోవడం శోచనీయమని ఆర్టీసీ టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశానికి హాజరైన ఆయన... వందల మందిని డిపో స్పేర్ పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలు, కరోనా పరిస్థితుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. టీఎంయూలో అధికార మార్పు అనేది లేదని... అశ్వత్థామరెడ్డి నాయకత్వానికి కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు తెలిపినట్టు ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఆరు నెలల తర్వాత హైదరాబాద్లో ఆర్టీసీ సేవలు