ETV Bharat / city

ఆదుకోవాల్సిన యాజమాన్యమే.. వాడుకుంది! - సీసీఎస్​ సొమ్ము వాడుకున్న ఆర్టీసీ యాజమాన్యం

నెలనెల పోగేసి దాచుకున్న సొమ్ము... ఒక్కసారిగా వచ్చి ఎవరైనా లాక్కుంటే... ఆ బాధ వర్ణనాతీతం. నోటి కాడి కూడు లాక్కున్నట్టు ఉంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. సీసీఎస్​లో దాచుకున్న సొమ్ము... అవసరాలకు తీసుకుందామనుకునేలోపే ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, పిల్లల పెళ్లిళ్లు కుదుర్చుకున్న కార్మిక కుటుంబాలు... సమయానికి డబ్బులు అందక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

rtc management used ccs funds and employes worried
ఆదుకోవాల్సిన యాజమాన్యమే.. వాడుకుంది!
author img

By

Published : Sep 28, 2020, 10:20 PM IST

భవిష్యత్ అవసరాల కోసం ఆర్టీసీ కార్మికులంతా కలిసి 1952లో... ఉద్యోగుల పొదుపు, పరపతి సంఘం (సీసీఎస్) ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు లక్షా 20వేల మంది కార్మికులతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఏపీఎస్​ఆర్టీసీ, టీఎస్​ఆర్టీసీ విడిపోయిన తర్వాత సుమారు 52వేల మంది కార్మికులు, ఉద్యోగులు నెలనెలా తమ జీతం నుంచి 7శాతం వాటా సీసీఎస్​లో పొదుపు చేస్తున్నారు. కాలక్రమేణా పదవీ విరమణ పొందిన 48 వేల మంది కార్మికులు ప్రస్తుతం సీసీఎస్​లో సభ్యులుగా ఉన్నారు. పదవీ విరమణ సభ్యత్వ డిపాజిట్ నిధుల కింద రూ.1,100 కోట్లు, ఫిక్స్​డ్ డిపాజిట్ కింద రూ.350 కోట్లతో పాటు మరికొన్ని నిధులు కలుపుకుని సీసీఎస్ వద్ద సుమారు రూ.1,500 కోట్ల ప్రారంభ నిధులు ఉన్నాయి.

దాచుకున్నది ఇందుకేనా..?

కార్మికులు దాచుకున్న వాటి నుంచే... కార్మికుడు చనిపోతే లోన్​ మాఫీ చేయడం, అప్పటి వరకు కట్టిన డబ్బులతోపాటు, రూ.5 లక్షల ఇన్సురెన్సు అందిస్తారు. ఇన్ని విధాలుగా సీసీఎస్ ఆదుకుంటుందనే ధీమాతోనే... కార్మికులు, ఉద్యోగులు సభ్యులుగా చేరారు. అవసరానికి ఆదుకుంటుందని పరపతి సంఘంలో దాచుకుంటే... ఇప్పుడేమో నిధులు లేవని యాజమాన్యం గెంటేస్తోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకేనా... తాము నెలనెల కష్టపడి దాచుకున్నదని ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యం ఇవ్వాల్సింది పోయి... ఉద్యోగుల నిధులు వాడుకోవడమేంటని వాపోతున్నారు.

యాజమాన్యం వాడుకుంది..!

ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి మినహాయించిన ఏడు శాతం నిధులు రూ.40 కోట్లు... 2018 నుంచి సీసీఎస్​కు చెల్లించకుండా రూ.675 కోట్లు ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంది. దీని మీద చెల్లించాల్సిన వడ్డీనే సుమారు రూ.150 కోట్ల వరకు ఉంది. అసలు, వడ్డీ ఇవ్వకపోవడం వల్ల సీసీఎస్​లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. నిధుల లేమీతో గతేడాది జనవరి నుంచి 16,640 దరఖాస్తుదారుల చెల్లింపులు పెండింగ్​​లో పెట్టినట్టు సీసీఎస్ పాలకవర్గం తెలిపింది. పిల్లల చదువు, పెళ్లిళ్లు, కొత్త ఇళ్ల కొనుగోళ్ల కోసం నిత్యం వందల మంది వచ్చి తిరిగి వెళ్తూనే ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన వారు... స్ట్రెచర్​తో సహా వచ్చినప్పటికీ... యాజమాన్యానికి కనికరం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని విశ్రాంత ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

అదొక్కటే మార్గం..

సభ్యులకు దాచుకున్న డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ... ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని సీసీఎస్ కార్యదర్శి మహేష్ తెలిపారు. రూ.675 కోట్లు ఆర్టీసీ యాజమాన్యం వాడుకోవడం వల్ల... నిధుల లేమి తలెత్తిందని తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 29 వరకు... 120 మంది కార్మికులు, ఉద్యోగులు మరణించారు. వారందరికి లోన్ మాఫీ చేసి, రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించారు. దీంతో ప్రస్తుతం రూ.150 కోట్ల లోటు ఉన్నట్టు సీసీఎస్ పాలకవర్గం వెల్లడించింది. రోజురోజుకు నిధులు తగ్గిపోతుంటే... కార్మికుల నుంచి ఒత్తడి పెరుగుతోందని పాలకవర్గం పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న నిధులు చెల్లిండమే ప్రస్తుత పరిష్కారమని... లేకుంటే మరింత అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని పాలకవర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.