ETV Bharat / city

లాభాలే లక్ష్యంగా.. ఆర్టీసీ కార్గో పార్శిల్ కొరియర్ సేవలు - ఆర్టీసీ పార్శిల్ సేవలు

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తువులు చేరవేయడంలో పార్శిల్, కొరియర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు పాగా వేశాయి. నమ్మకమే పెట్టుబడిగా... ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు కార్గో పార్శిల్ కొరియర్(సీపీసీ) సేవలను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సీపీసీతో ఆదాయం సమకూరుతోందని సంస్థ అభిప్రాయపడుతోంది.

rtc corgo parcle corrier services in telanagana
లాభాలే లక్ష్యంగా.. ఆర్టీసీ కార్గో పార్శిల్ కొరియర్ సేవలు
author img

By

Published : Oct 4, 2020, 5:45 PM IST

Updated : Oct 4, 2020, 7:38 PM IST

లాభాలే లక్ష్యంగా.. ఆర్టీసీ కార్గో పార్శిల్ కొరియర్ సేవలు

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీ. నిత్యం వేలాది బస్సుల్లో లక్షలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు ఆ ధీమాతోనే ఆర్టీసీ కార్గో, పార్శిల్, కొరియర్(సీపీసీ) రంగంలోకి అడుగుపెట్టింది. ఆర్టీసీకి ఈ రంగం కొత్తదైనప్పటికీ... సుమారు రెండు మూడు నెలలపాటు మెళకువలు ఒంటపట్టించుకొని... మార్కెట్​ను అంచనా వేసింది. అనుభవజ్ఞులైన ఆర్టీసీ సిబ్బందిని రంగంలోకి దింపి... ప్రైవేట్ కొరియర్, పార్శిల్ సేవలు ఎలా అమలు అవుతున్నాయి... ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నాయి... తదితర అంశాలపై సర్వే చేసింది. ఆర్టీసీకి కేవలం రాష్ట్రంలో కాకుండా... పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్టాటక, మహారాష్ట్రతో ఉన్న నెట్​వర్క్ సంస్థకు కలిసివచ్చే అంశంగా అధికారులు భావించారు. ఇక ప్రైవేట్ సంస్థల కంటే తక్కువల ధరలతో... వేగంగా, సురక్షితంగా, ప్రజలకు మరింత దగ్గరగా అనే నినాదంతో ఆర్టీసీ యాజమాన్యం ముందడుగు వేసింది.

రాబడి పెరుగుతోంది..

జూన్ 19న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సీపీసీ సేవలు ప్రారంభించారు. అంతకు ముందే లాక్​డౌన్ సమయంలోనే కార్గో సేవలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 6లక్షలకు పైగా పార్శిళ్లను గమ్యస్థానాలకు చేర్చింది. రాష్ట్రంలోని 147 బస్టాండ్లలో ఈ సేవలను అందుబాటులో ఉంచారు. 600 పార్శిల్ అండ్ కార్గో సర్వీసు ఏజెంట్లు, 1,258 మంది ఆర్టీసీ నేస్తం సిబ్బందితో పార్శిల్ బుకింగ్​లు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తక్కువ సంఖ్యలో తిరుగుతున్నప్పటికీ... కార్గో, కొరియర్, పార్శిల్ సర్వీసులకు మాత్రం ఆధరణ పెరుగుతూనే ఉంది. ప్రారంభంలో రోజుకు కేవలం రూ.2 లక్షల ఆదాయం మాత్రమే సంస్థకు సమకూరేది. ఇప్పుడు సుమారు రూ.10లక్షల వరకు వస్తోంది. ఈ ఆదాయాన్ని సైతం రూ.15లక్షలకు పెంచాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటికితోడు 150 కార్గో బస్సులు, 28 మిని కార్గో బస్సులను తిప్పుతోంది. కార్గో బస్సులతో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు రూ.3.50కోట్ల ఆదాయం సమకూరింది.

అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్ణయం

బీహెచ్​ఈఎల్​, కూకట్​పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంతాల్లోనే ఆర్టీసీ పార్శిల్, కొరియర్ సేవలు అందిస్తోంది. అన్ని ప్రాంతాలకు విస్తరించి, ఇంటి వద్దకే పార్శిల్ డెలివరీ చేయాలని యాజమాన్యం భావిస్తోంది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు, ఇతర సామాగ్రిని... తెలంగాణలోని 103, ఆంధ్రప్రదేశ్​లోని 150 కేంద్రాల నుంచి ఆర్టీసీ ద్వారానే రవాణా చేసేందుకు ఇటీవలే ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వ సంస్థలైన టీఎస్​ ఫుడ్స్, ప్రభుత్వ ప్రెస్, వ్యవసాయ శాఖ ఉత్పత్తులు, సీడ్స్ కార్పోరేషన్​, ఇంటర్మీడియట్ బోర్డుతోపాటు బతుకమ్మ చీలరను కూడా ఆర్టీసీనే సరఫరా చేసింది.

ఈ-కామర్స్​తో ఒప్పందం!

ఆర్టీసీ పార్శిల్, కార్గో, కొరియర్ సేవలు వినియోగించుకునేందుకు ఫ్లిప్​కార్ట్​ ఏజెంట్లు ఒప్పందం చేసుకున్నారు. నేరుగా ఫ్లిప్​కార్ట్​ సేవల కోసం కూడా చర్చలు కొనసాగుతున్నాయి. శంషాబాద్​లో కొత్త గోడౌన్​ వచ్చిన తర్వాత ఒప్పందం చేసుకునేందుకు అమెజాన్​ కూడా సానుకూలంగా ఉంది. పుణే, ముంబయి, రాయచూర్​కు ఇప్పటికే వ్యాపారం కొనసాగుతోంది. వాటిని కండక్టర్ల ద్వారా నడిపిస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు బస్సులు నడిస్తే... వ్యాపారం మరింత విస్తరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుకు కూడా ఆర్డర్లు వస్తున్నాయి కానీ... బస్సు సేవలు ఇంకా ప్రారంభ కాలేదు. బస్సులు నడిస్తే మరింత ఆదాయం సమకూరనుంది.

ఇంటి షిఫ్టింగ్ సేవలు కూడా

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ మంది తరచుగా ఇళ్లను ఖాళీ చేస్తుంటారు. ఇటువంటి వారికోసం కేవలం 50కిలోమీటర్ల పరిధిలో అతి తక్కువ ధరలో కార్గో వాహనాన్ని వాడుకునే సౌలభ్యాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి వస్తువులను తరలించడానికి 8 టన్నుల వాహనానికి రూ.4,420లు, 4 టన్నుల వాహనాలను రూ.3,620లు చెల్లించి వినియోగించుకోవచ్చు. ఇంటి సామాన్లు దించేందుకు, తిరిగి సర్దేందుకు హమాలీలను కూడా ఆర్టీసీనే సమకూర్చుతుంది. ఇందుకోసం ఎంజీబీఎస్, జేబీఎస్​లో హమాలీలు ఎప్పుడూ సిధంగా ఉంటారు. కాకపోతే అధనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లేదంటే... తమకు తెలిసిన హమాలీలను కూడా వినియోగించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేసేందుకు ఇటీవలే భూపాలపల్లి నుంచి బెంగుళూరుకు కార్గో సర్వీసులను చాలామంది వినియోగించుకున్నాట్టు కార్గో ప్రతినిధిలు తెలిపారు.

రైతన్న సేవలో..

కార్గో సేవలపై గ్రామాలకు వెళ్లి రైతులకు వివరిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసి వాహనాన్ని అద్దెకు తీసుకుంటే ధాన్యాన్ని సురక్షితంగా, వేగంగా పంట పొలాల వద్ద నుంచి రైస్ మిల్లుల వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కార్గో ఇంఛార్జ్, రవాణాశాఖ శాఖ మంత్రి ఓఎస్డీ క్రిష్ణకాంత్ తెలిపారు. కార్గో వినియోగించడం వల్ల వర్షం నుంచి కూడా ధాన్యం తడవకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. గతంలో రానుపోను చార్జీలు వసూలు చేసేవారు ఇప్పుడు కేవలం ఒక్క ఛార్జ్ మాత్రమే వసూలు చేస్తున్నారు. ఏజెంట్ల నియామకం జరగడం వల్ల ఈ వెసులుబాటు కలిగింది. చిన్న వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారవేత్త వరకు ఆర్టీసీ సీపీసీ సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో... ప్రైవేటు సంస్థలకు ధీటుగా సేవలు విస్తరిస్తోంది.

ఇదీ చూడండి: ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు చర్యలు

Last Updated : Oct 4, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.