ETV Bharat / city

సిద్ధమవుతున్న ఆర్టీసీ బస్సులు.. హైదరాబాద్​లో రోడ్డెక్కేదెప్పుడో..? - లాక్​డౌన్​ తర్వాత ఆర్టీసీ షురూ

గ్రేట‌ర్ హైదరాబాద్‌ ప‌రిధిలో RTC బ‌స్సులు ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతాయా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. అన్‌లాక్-4లో కేంద్రం మెట్రోలకు అనుమ‌తి ఇచ్చినందున... ఆర్టీసీ బ‌స్సులకు కూడా అనుమతులు లభిస్తాయనే ఉద్దేశంతో రంగం సిద్ధం చేస్తున్నారు. ఐదు నెల‌లుగా డిపోల‌కే ప‌రిమిత‌మైన బ‌స్సుల‌కు మ‌ర‌మతులు చేస్తున్నారు. నగరంలో ఆర్టీసీ సేవలు ప్రారంభమైతే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని కూలీలు, చిరు ఉద్యోగులు భావిస్తున్నారు.

rtc busses ready to start in hyderabad after lockdown
సిద్ధమవుతున్న ఆర్టీసీ బస్సులు.. రోడ్డెక్కేదెప్పుడో..?
author img

By

Published : Sep 1, 2020, 5:15 AM IST

సిద్ధమవుతున్న ఆర్టీసీ బస్సులు.. రోడ్డెక్కేదెప్పుడో..?

హైదరాబాద్‌ నగరంలో ఉద్యోగులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తుంటారు. లాక్‌డౌన్‌ను దశలవారిగా ఎత్తివేస్తున్నప్పటికీ... సిటీ బస్సులకు మాత్రం ఇంకా అనుమతులు రాలేదు. దీంతో వారంతా ఆటోలు, క్యాబ్‌ల్లో అధిక ధ‌ర‌లు వేచ్చిస్తూ వెళ్లాల్సి వస్తోంది. తాజాగా మెట్రో నడిపేందుకు అనుమతి ఇవ్వడం వల్ల... సిటీ బస్సులు కూడా అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. గ్రేట‌ర్ హైదరాబాద్‌ ప‌రిధిలో 29 డిపోల్లో సుమారు 2,900ల బ‌స్సులు ఉన్నాయి. లాక్‌డౌన్‌ త‌ర్వాత కేవ‌లం అత్యవ‌స‌ర విభాగాల్లో ప‌నిచేసే వైద్య సిబ్బంది, జీహెచ్​ఎంసీ సిబ్బంది కోసం మాత్రమే కొన్ని ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డిపిస్తున్నారు.

సిటీ బస్సులకు అనుమతులు లభించిన వెంటనే సర్వీసులు ప్రారంభించేందుకు... డిపోల్లోని బస్సులను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. బ‌స్సులు ఎక్కువ కాలం డిపోల్లోనే ఉండ‌టం వల్ల దుమ్ముదూళీతో నిండిపోయాయి. ఒక్కో బ‌స్సును బ‌య‌ట‌కి తీసి... శుభ్రంగా క‌డుగుతున్నారు. సీట్లను శానిటైజ్ చేస్తున్నారు. చాలాకాలంగా న‌డ‌ప‌కపోవ‌డం వల్ల టైర్లలో గాలి త‌గ్గిపోవడం, బ్యాట‌రీలు డిశ్చార్జ్ అయ్యాయి. అలాంటి వాటికి మరమ్మతులు చేస్తున్నారు. బ్రేకులు, ఎక్స్‌లేట‌ర్లు, గేర్లు వంటి వాటిని స‌రిచేస్తున్నారు. ఇంజిన్‌ స‌క్రమంగా ప‌నిచేసేందుకు రోజూ గంట నుంచి రెండు గంట‌ల పాటు ఆన్‌ చేసి ఉంచుతున్నారు. బ‌స్సుల‌ను పూర్తిస్థాయిలో కండీష‌న్‌లో ఉంచేందుకు సిబ్బంది ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటి వ‌ర‌కు డిపోల‌కే ప‌రిమితమైన బ‌స్సులు రోడ్డేక్కేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆర్టీసీ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే సర్వీసు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ముఖర్జీ మరణంపై ఆరెస్సెస్, భాజపా విచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.