ఇంగ్లాండ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్.. టెస్టు ఫార్మాట్లో 3 వేల పరుగులు మార్క్‌ను అందుకున్నాడు. విదేశాల్లో రోహిత్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ.
74 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 3 వేల పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే అతడి కన్నా ముందున్నాడు. కోహ్లీ 73 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.
ఓపెనర్‌గానూ విజృంభణ..
ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల పరుగులను నమోదు చేశాడు రోహిత్. ఈ రికార్డు అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. సచిన్ తెందూల్కర్ 241 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకోగా.. రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.