Rock Museum In Hyderabad: ఆర్ట్ మ్యూజియం, చారిత్రక మ్యూజియం, సాంస్కృతిక మ్యూజియం గురించి విని ఉంటారు. ప్రత్యేకంగా రాళ్లకోసం ఏర్పాటు చేసిన మ్యూజియం గురించి విన్నారా.. అది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే కొలువుతీరింది. హైదరాబాద్ హబ్సిగూడాలోని సీఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐ సంస్థలో ఏర్పాటుచేసిన ఈ ఓపెన్ రాక్ మ్యూజియాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖామంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు.
దేశంలోనే మొదటి రాక్ మ్యూజియంగా ఇది నిలుస్తుందని ఆయన ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలనుంచి సేకరించిన 45 రకాల అతిపూరాతన, విభిన్న శిలలను ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. 3.3 బిలియన్ సంవత్సరాల పురాతన శిలలను సైతం శాస్త్రవేత్తలు సేకరించి ఈ రాక్ మ్యూజియంలో అందుబాటులో ఉంచారు. భూమి పొరల నుంచి 175 కిలోమీటర్ల లోతు నుంచి సేకరించిన అరుదైన శిలలను సేకరించామని.. ఈ శిలల పుట్టుక భూమి గర్భంలో దాగి ఉన్న అనేక రహస్యాలకు సాక్షీబూతాలని ఎన్జీఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త ఈవీఎస్ఎస్కే బాబు అన్నారు. ఇవాల్టి నుంచి దేశంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు, జౌత్సాహిక చరిత్రకారులకు ఈ రాక్ మ్యూజియంను సందర్శించేందుకు అనుమతిస్తామంటోన్న సీఎస్ఐఆర్- ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: