ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో.. ద్విచక్రవాహనం అదుపతప్పి ఓ వ్యక్తి మృతి చెందారు. నూతలపాడుకు చెందిన యోగి యోబు (30) గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. పక్కనే ఉన్న పూసపాడులో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ గ్రామంలో ద్విచక్రవాహనం ఢీకొట్టి వ్యక్తి మృతి చెందాడు. జొన్నలగడ్డ గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... మరో ద్విచక్ర వాహనం వారిని ఢీకొట్టింది. సురేశ్ అనే వ్యక్తికి తలకు బలమైన గాయమై మృతి చెందాడు.
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ప్యాధిండ్డి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆదివారం ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందాడు. బొగూడూరు గ్రామానికి చెందిన శంకర్ అతని సోదరుడు సుబ్రహ్మణ్యం ద్విచక్ర వాహనంలో ధర్మవరం వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శంకర్ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బోడసింగిపేట పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని విశాఖ వైపు నుంచి రాయగడ వైపు వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్లీనర్ మృతి చెందాడు.
ఇదీ చదవండి: