ETV Bharat / city

Andhra pradesh revenue 2022 : ఏపీలో రెవెన్యూ అగాధం.. 900% దాటిన 'లోటు' - తెలంగాణ తాజా వార్తలు

Andhra pradesh revenue 2022 : ఏపీలో రెవెన్యూ అగాధం ఏర్పడింది. రెవెన్యూ లోటు ఏకంగా 900 శాతం దాటేసింది. అదే సమయంలో సొంత ఆదాయానికి దాదాపు సమానంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. బడ్జెట్‌ అంచనాలను మించి... ఏపీ ప్రభుత్వం 9నెలల్లోనే రూ.58 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంది.

Andhra pradesh revenue 2022, ap revenue
ఏపీలో రెవెన్యూ అగాధం..
author img

By

Published : Feb 14, 2022, 9:32 AM IST

Andhra pradesh revenue 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడి కంటే... రెవెన్యూ ఖర్చులు చాలా వరకు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో రెవెన్యూ లోటు కొండలా పేరుకుపోతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాలకు సంబంధించిన ఆ రాష్ట్ర లెక్కలు ఖరారయ్యాయి. చట్టసభలకు బడ్జెట్ సమర్పించిననాడు రెవెన్యూ లోటు రూ.5వేల కోట్ల 6 లక్షలు మాత్రమే. ఆ మేరకు రెవెన్యూ ఉంటుందని లెక్కించారు. ఆమేరకు రెవెన్యూ రాబడిని, ఖర్చులను సమన్వయం చేసుకునేలా బడ్జెట్ ప్రతిపాదించారు. డిసెంబర్ నెలాఖరుతో ముగిసిన 9నెలల కాలంలో రెవెన్యూ లోటు రూ.45వేల 907.65 కోట్లుగా లెక్క తేలింది.

revenue : అంచనాలకన్నా అది 918.14శాతం మేర పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రెవెన్యూ లోటు... నాటి అంచనాలతో పోలిస్తే 270శాతానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్రమేణా రెవెన్యూ రాబడులు మెరుగుపడుతున్నాయి. ఆ రాష్ట్ర సొంత ఆదాయాలకు పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడిగా లెక్కిస్తుంటారు. రెవెన్యూ రాబడి దాదాపు లక్ష కోట్లకు చేరింది. ఈ 9నెలల్లో కేంద్రం నుంచి గ్రాంటుగా వచ్చిన రూ.25వేల 246.19 కోట్లతో కలిపి మొత్తం రెవెన్యూ రాబడి రూ.97వేల 887.21 కోట్లకు చేరింది.

ap revenue deficit : ఏపీలో రెవెన్యూ లోటు ఒక్కటే కాదు... అప్పులు కూడా అంచనాలను మించిపోతున్నాయి. తొలి 9 నెలల్లో ప్రభుత్వం ఏకంగా రూ.58,111.85 కోట్లు రుణంగా సమీకరించింది. బడ్జెట్ అంచనాల్లో రూ.37వేల 29.79 కోట్ల రుణంతోనే ఈ ఆర్థిక సంవత్సరాన్ని గట్టెక్కవచ్చని భావించింది. అలాంటిది ఇప్పటికే అప్పు అంచనాలకు మించి 156 శాతానికి చేరింది. ప్రభుత్వం చేసిన అప్పులు... ఆ రాష్ట్ర సొంత ఆదాయానికి దాదాపు సమానంగా ఉన్నాయి. జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమిశిస్తు, అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు కలిపి... ఈ 9నెలల్లో ఏపీకి వచ్చిన పన్నుల ఆదాయం రూ.69వేల 943.71 కోట్లుగా ఉంది. అదే సమయంలో వివిధ రూపాల్లో సమీకరించిన అప్పు రూ.58వేల కోట్లకు పైనే ఉంది.

ఇదీ చదవండి: CM KCR: జనం కోరితే జాతీయ పార్టీ... మోదీ పాలనలో దేశం సర్వనాశనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.