ETV Bharat / city

Revanth reddy: కేటీఆర్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. భీమవరం నుంచా లేక బొబ్బిలి నుంచా..? - తెలంగాణ తాజా వార్తలు

జగన్ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లు మొదటి నుంచి కూడా కవలపిల్లల్లా కలిసిపోతున్నారని, ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రం కోసం ఆలోచన చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Oct 29, 2021, 10:04 PM IST

Revanth reddy: కేటీఆర్‌ బీమవరం నుంచా లేక బొబ్బిల్లో పోటీచేస్తారా..?

వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు పాదయాత్ర చేయడం, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను మళ్లీ కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్నినాని ప్రతిపాదనలు చేయడం అనుకోకుండా జరిగినవి కావని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలను మరింతగా పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి జైలుకు వెళతారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని రేవంత్​రెడ్డి అన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని అనుకుంటున్నట్లుగా ప్రస్తుత పరిణామాలున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లు మొదటి నుంచి కూడా కవలపిల్లల్లా కలిసిపోతున్నారని, ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రం కోసం ఆలోచన చేస్తున్నట్లు ఉందని విమర్శించారు.

'కేసీఆర్, జగన్ మొదట్నుంచి కవలలుగా కలిసి వెళ్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం కోసం జగన్, కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర, పేర్ని నాని వ్యాఖ్యలు యాధృచ్ఛికం కావు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర సాగుతోంది. జగన్ జైలుకు వెళ్తే ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కావాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లుంది.'

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు.

ఏపీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడుస్తున్నా... తెరాస నేతలు ఎందుకు ఖండించడం లేదో చెప్పాలని రేవంత్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రాన్ని తిరిగి కలపాలన్న కుట్రను తెలంగాణ ప్రజలు సహించరన్న రేవంత్ రెడ్డి పేర్నినాని వ్యాఖ్యలను తెరాస ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. మౌనం అర్థాంగీకారమని, నాని వ్యాఖ్యలను స్వాగతించినట్లే కదా అని నిలదీశారు.

'గతంలో కేటీఆర్​కు ఏపీలోని భీమవరంలో ఫ్లెక్సీలు కట్టారు. కేటీఆర్​ కూడా అన్నారు... భీమవరంలో పోటీచేయమని పిలుస్తున్నారని. ఇప్పుడు కేటీఆర్‌ భీమవరం నుంచినా... బొబ్బిలి నుంచినా ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదు.'

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీచూడండి: Revanth Reddy: 'పేలవమైన వాదన వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిలిపేయాలని తీర్పొచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.