ETV Bharat / city

కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు తెరాస, భాజపా కలిసి పని చేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి - కేసీఆర్​ పాలనపై రేవంత్ మండిపాటు

Revanth reddy on Munugode Bypoll: కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు తెరాస, భాజపా కలిసి పనిచేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో రెండు పార్టీలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్‌ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు.. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుందని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

revanth reddy
revanth reddy
author img

By

Published : Sep 10, 2022, 7:55 PM IST

Revanth reddy on Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికలో భాజపా, తెరాసలకు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటకే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్‌ రాజు సహా ఇతర సీనియర్‌ నేతలు మునుగోడు ఉపఎన్నిక, పలు అంశాలపై చర్చించారు.

కేసీఆర్‌ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు.. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుందని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలు కుప్పకూలాయని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచార వ్యూహంలో భాగంగా పలువురు సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తామని... నల్లగొండ జిల్లా కు కేంద్ర ప్రభుత్వం వల్ల ఎటువంటి లాభం జరగలేదని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు తెరాస, భాజపా కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

మోదీ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో నిరుద్యోగం ఉండేది కాదని రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. ఉప్పు, పప్పు చివరకు పాలు, పెరుగుపై జీఎస్టీ వేశారని మండిపడ్డారు. మోదీ ఇచ్చిన హామీ ప్రకారం 16 కోట్ల ఉద్యోగాలు రావాల్సిందన్నారు. మోదీ ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో 50 లక్షలు రావాలని గుర్తుచేశారు. మునుగోడులో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది అరాచక పాలన అని మండిపడ్డారు. తెరాసకు ఉరి వేసినా తప్పు లేదని అన్నారు.

కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు తెరాస, భాజపా కలిసి పనిచేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

'మోదీ సర్కార్‌ వంటగ్యాస్‌ సహా నిత్యావసర ధరలు భారీగా పెంచారు. మునుగోడులో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు. కేసీఆర్‌ది అరాచక పాలన. తెరాసకు ఉరి వేసినా తప్పు లేదు. మోదీ, కేసీఆర్‌ను భూమిపైకి దింపే అవకాశం ప్రజల చేతిలో ఉంది. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించాలి. కమ్యూనిస్టు కార్యకర్తలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలను మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వివరిస్తాం. సెప్టెంబర్ 18 నుంచి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నేతలు ప్రచారం నిర్వహిస్తారు.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.