హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరప్రాంతాల్లో సుందరీకరణ పనులు.. ముమ్మరంగా సాగుతున్నాయి. అందమైన దీపాలు, పాదచారుల దారులను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సాధ్యమైనంత త్వరలోనే వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.
సుందరీకరణ పనులకు సంబంధించిన ఛాయాచిత్రాలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అందుకు సంబంధించిన సూచనలు చేయాల్సిందిగా కేటీఆర్ నగర పౌరులను కోరారు.
ఇదీ చదవండి: ఆధునిక హంగులతో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణకట్ట