ETV Bharat / city

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో జూన్​ 7 నుంచి 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ షెడ్యూల్​ విడుదల చేశారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
author img

By

Published : Feb 3, 2021, 7:16 PM IST

Updated : Feb 3, 2021, 9:23 PM IST

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల షెడ్యూల్​

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పదోతరగతి పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసింది. జూన్‌ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ ఏడాది 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సైన్స్‌లో 2 పేపర్లు ఉంటాయని స్పష్టం చేశారు.

కరోనా దృష్ట్యా పాఠశాలలు ఎక్కువ రోజులు తెరవకపోవడంతో..విద్యా దినాలు కుదించాల్సి వచ్చిందన్నారు. అందువల్లే ఈసారి పది పరీక్షలను 7 పేపర్లకే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. మే 3 నుంచి 10 వ తేదీ వరకు ఇతర తరగతుల వారికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని మంత్రి సురేశ్ వెల్లడించారు.

తేదీ పరీక్ష
జూన్ 7 ‌ ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 8 సెకండ్ లాంగ్వేజ్
జూన్‌ 9 ‌ ఇంగ్లిష్
జూన్ 10 గణితం
జూన్‌ 11 భౌతికశాస్త్రం
జూన్ 12 జీవశాస్త్రం
జూన్‌ 14 సాంఘికశాస్త్రం

ఇదీ చూడండి: పదో తరగతిలో 6 పరీక్షలే.. ప్రభుత్వం ప్రకటన

Last Updated : Feb 3, 2021, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.