ETV Bharat / city

ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో.. పోస్టుల పునర్విభజనే కీలకం - Job recruitment process

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం పోస్టుల పునర్విభజన కీలకం కానుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి, సర్వీసు నిబంధనలు వెలువడితే తప్ప నియామక ప్రకటనలకు ఆస్కారం ఉండదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడం వల్లనే గత రెండేళ్లుగా వివిధ ఉద్యోగాల భర్తీ, ప్రకటనలు నిలిచిపోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

redistribution-of-posts-is-important-for-job-recruitment-in-telangana
పోస్టుల పునర్విభజనే కీలకం
author img

By

Published : Dec 15, 2020, 10:19 AM IST

మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల విభజన, సర్వీసు నిబంధనలు రూపొందించడంలో జాప్యంతో రాష్ట్రంలో నియామక ప్రకటనల ప్రక్రియ ముందుకు జరగడం లేదు. 2018లోనే ప్రకటన వెలువరించాలని భావించినా.. తొలి తెలంగాణ గ్రూప్‌-1 ప్రకటన రాష్ట్రపతి ఉత్తర్వులు తదితర సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల పునర్విభజన సమస్యలతో కమిషన్‌కు ప్రతిపాదనలు వచ్చినా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణలు లేకపోవడంతో 3,194 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు. ఇందులో గ్రూప్‌-1, 2, 3తో పాటు ఇతర ఖాళీలున్నాయి. గ్రూప్‌-1లో ప్రకటనలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, సీటీవో, మున్సిపల్‌ కమిషనర్లు, సంక్షేమ అధికారులు, జిల్లా, డిప్యూటీ రిజిస్ట్రార్లు తదితర పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా డీఎస్పీ-42, డిప్యూటీ కలెక్టర్‌-8, సీటీవో-19 పోస్టులు ఉన్నాయి.

చిక్కుముళ్లు వీడితేనే..

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం గుర్తించిన పోస్టులను జిల్లా, జోన్లు, మల్టీ జోన్ల వారీగా పునర్విభజించాలి. ఈ ప్రక్రియ వెంటనే చేపట్టి ఆ మేరకు సవరణ ప్రతిపాదనలు పంపాలంటూ 3,194 పోస్టులకు ప్రకటన వెలువడిన సందర్భంలో టీఎస్‌పీఎస్సీ కోరింది. పలుమార్లు విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించినా సమస్య కొలిక్కిరాలేదు. మరోవైపు నూతన ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజన, రోస్టర్‌, ఖాళీ పోస్టుల గుర్తింపుపై సాధారణ పరిపాలన విభాగం కూడా కసరత్తు చేసింది. విభాగాల వారీగా జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టుల పునర్విభజన చేయాలని సూచించింది. కొన్ని విభాగాలు మాత్రమే ప్రతిపాదనలు పంపించినా, మిగతావి పంపించలేదు.

మరోవైపు కొత్త ఉత్తర్వుల ప్రకారం పలు విభాగాల్లోని పోస్టుల కేటగిరీలు మారిపోయాయి. ఉదాహరణకు గతంలో ఉన్న జిల్లా పోస్టులు జోనల్‌ పోస్టులుగా మారగా, జోనల్‌ పోస్టులు మల్టీజోనల్‌ కిందకు వచ్చాయి. గతంలో ఒకే మల్టీజోన్‌ ఉండగా, ఇప్పుడవి రెండయ్యాయి. ఆయా పోస్టుల్ని రెండు జోన్లకు కేటాయించాల్సి ఉంది. ఇక జోన్‌ల విషయానికొస్తే రెండు జోన్‌లను ఆరు జోన్లుగా మార్చినందున ఆ మేరకు పోస్టుల్ని విభజించాల్సి ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడున్న 31 జిల్లాలను 33కు మార్చినందున ఆ జిల్లాలపై సవరణ ఉత్తర్వులు రావాల్సి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పూర్వ జిల్లాల సిబ్బందిని ‘ఆర్డర్‌ టు సర్వ్‌’ కింద పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పుడు వీరందర్నీ శాశ్వతంగా సర్దుబాటు చేసిన తరువాతే ఏయే జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో ఖాళీలు ఉన్నాయో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంది.

రోస్టర్‌ లెక్కింపుపై తొలగని సందిగ్ధం

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజనలో రోస్టర్‌ను ఎలా లెక్కించాలన్న విషయమై కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొత్త జోన్ల ప్రకారం పోస్టుల విభజన, రోస్టర్‌, ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఉద్యోగులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆయా శాఖల నుంచి తీసుకుంటోంది. ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులను నూతన జోన్లు, మల్టీజోన్ల ప్రకారం కేటాయించాల్సి వచ్చినపుడు రోస్టర్‌ పాయింటు లెక్కింపు కొత్తగా చేపట్టాలా? పాత రోస్టర్‌ పాయింటు ప్రకారం ముందుకు వెళ్లాలా అనే విషయమై నిబంధనలను పరిశీలిస్తోంది. కొత్త రోస్టర్‌ను తీసుకుంటే ఇప్పటికే గుర్తించిన(నోటిఫై చేసిన) పోస్టులను రద్దుచేయాలా? రోస్టర్‌ ప్రకారం ఆయా పోస్టుల రిజర్వేషన్‌ కేటగిరీ మార్చాలా? అనేది తేల్చే దిశగానూ కసరత్తు మొదలుపెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.