love with biryani: బిర్యానీ అనే పదం వింటేనే నోట్లో అలా లాలాజలం ఊరిపోతుంటుంది. అలాంటిది హైదరాబాద్ బిర్యానీ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ బిర్యానీ అంటే.. నగరవాసులకు ఓ ఎమోషన్. అలాంటి రుచికరమైన ఎమోషన్‌ను అంతే ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చి మరింత రుచికరమైన జ్ఞాపకంగా మార్చుకునేందుకు మనముందుకొస్తోంది.. "లవ్ విత్ బిర్యానీ".
కుటుంబసభ్యులతో.. స్నేహితులతో.. ప్రియమైన వారితో కూర్చోని కడుపు నిండా బిర్యానీ తింటే ఎంత సంతోషంగా ఉంటుంది. అదే.. వాళ్లకు ఎంతో ఇష్టమైన బిర్యానీని ఓ బహుమతిగా పంపిస్తే.. ఇంకెంత సంతోషంగా ఉంటారు. అవును.. ఇప్పుడు అచ్చం అదే కాన్సెప్ట్‌తో తనిసి రెస్టారెంట్స్ ఇన్ కర్పోరేట్ సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్ ప్రత్యేకతల్లో ఒకటైన బిర్యానీని.. నచ్చిన వ్యక్తులను బహుమతిగా పంపించేందుకు "లవ్ విత్ బిర్యానీ" పేరుతో సిద్ధం చేస్తోంది. కెనడాలో ఛార్మినార్ పేరుతో భారతీయ రుచులను అక్కడి వారికి పరిచయం చేస్తున్న.. తనిసి రెస్టారెంట్స్ ఇన్ కార్పోరేట్ సంస్థ.... హైదరాబాద్‌లో లవ్ విత్ బిర్యానీని ప్రారంభించింది.
సుమారు 60 రకాల బిర్యానీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజిని సిద్ధం చేసింది. ఈ లవ్ విత్ బిర్యానీని మాదాపూర్‌లో ప్రముఖ ర్యాపర్ రోల్ రైడా ఆవిష్కరించారు. బిర్యానీ రుచి, ప్రత్యేకతలను వివరిస్తూ.. రోల్ రైడా తనదైన శైలిలో ఓ పాట కూడా పాడారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకొని నచ్చిన వ్యక్తులకు బిర్యానీని పంపించవచ్చంటోన్న రోల్‌రైడా... బిర్యానీ అంటే హైదరాబాద్ ప్రజలకు ఓ సెలబ్రేషన్ అంటున్నారు. తన స్నేహితులు ప్రారంభించిన లవ్ విత్ బిర్యానీ రెస్టారెంట్‌కు తన ర్యాప్‌ను జోడిస్తూ.. హైదరాబాద్‌వాసులకు ఆ ఘుమఘుమలు తెలిసేలా చేస్తున్నాడు. బిర్యానీపై తనకున్న ప్రేమను పాటగా మార్చి.. ఎప్పుడెప్పుడు లవ్ విత్ బిర్యానీని టెస్ట్ చేయలా అన్న ఉత్సుకత కలిగిస్తున్నాడు. ఈటీవీ భారత్‌తో పంచుకున్న ఘుమఘుమల బిర్యానీ ముచ్చట్లతో నోట్లో నీళ్లూరిపోతున్నాయి. మరి మీరూ లవ్ విత్ బిర్యానీని టేస్ట్ చేసి.. మీ ప్రియమైన వారికి, బిర్యానీ ప్రియులకు గిఫ్ట్‌గా పంపించేయండి.. వినేయండి..
ఇవీ చూడండి: