హైదరాబాద్ వనస్థలిపురంలోని 4 ప్రాంతాల్లోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు గుర్తించారు. కంటైన్మెంట్ జోన్లలో రేపట్నుంటి వారం రోజులపాటు రాకపోకలు నిలిపివేయనున్నారు. నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలుచేయనున్నారు.
కంటైన్మెంట్ జోన్లుగా హుడాసాయినగర్, సుష్మాసాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఎ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్, ఎస్కెడినగర్, రైతుబజార్-సాహెబ్నగర్ను అధికారులు ప్రకటించారు.
వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనస్థలిపురం పరిధిలో 169 కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు.