ETV Bharat / city

రంజాన్ పండగ ప్రత్యేకం ఈ ఆష్

రంజాన్ మాసంలో ఆష్ అనే వంటకం ఎంతో ప్రత్యేకం. రుచి మాత్రమే కాదు, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.

special food item assh in Ramaadan
special food item assh in Ramaadan
author img

By

Published : Apr 29, 2020, 6:14 PM IST

రంజాన్‌ మాసంలో ఉపవాసం ముగిసిన తర్వాత ఇచ్చే విందులో ఆష్‌ అనే వంటకాన్ని వడ్డిస్తారు. ఇది కూడా జావ మాదిరిగా వెంటనే అరిగిపోయి శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. దీన్నెలా తయారుచేయాలంటే…

కావాల్సినవి: బియ్యం- అరకప్పు, పెసరపప్పు- పావుకప్పు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- ఒకటి, మిరియాల పొడి- టీస్పూన్‌, కొబ్బరి కోరు- టీస్పూన్‌, నెయ్యి- రెండు టీస్పూన్లు, కొత్తిమీర తురుము- కొద్దిగా.

తయారీ: ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించి పొడిచేయాలి. పెసరపప్పును కూడా విడిగా వేయించి కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, మెత్తగా మెదుపుకోవాలి. స్టవ్‌ మీద గిన్నె పెట్టి రెండు స్పూన్ల నెయ్యి పోసి వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము వేసి వేయించాలి.

తర్వాత పెసరపప్పు ముద్ద వేసి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు రెండు స్పూన్‌ల బియ్యం పొడి వేసి మంట తగ్గించి అయిదు నిమిషాలపాటు ఉడికించాలి. తర్వాత మిరియాల పొడి, నెయ్యి, కొబ్బరికోరు వేసుకుని దించేయాలి. దీనిపైన కాస్త కారబ్బూందీ చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇష్టమైనవాళ్లు ఈ జావలో ఉడికించిన మాంసం లేదా చికెన్‌ ముక్కలను వేసుకోవచ్చు.

ఇవీ చూడండి

'మేము సచిన్​ను స్లెడ్జింగ్​ చేసేవాళ్లం కాదు.. ఎందుకంటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.