వివాదాలు వైఫైలా చుట్టూ తిప్పుకునే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఉదయాన్నే లేచి పోర్న్ సినిమాలు చూస్తానని గతంలో చెప్పి షాకిచ్చిన వర్మ.. తాజాగా ప్రేమ, శృంగారానికి సంబంధించి బోల్డ్ కామెంట్ చేశారు. ప్రేమని, సెక్స్‌ను కెమిస్ట్రీ, ఫిజిక్స్‌తో పోలుస్తూ ట్వీట్ పెట్టాడు. `ప్రేమ అనేది కెమిస్ట్రీకి సంబంధించినదని, కానీ సెక్స్ ఫిజిక్స్ కి సంబంధించినది` అని బోల్డ్ ట్వీట్ చేసి మరోసారి వివాదానికి తెరలేపాడు.
వర్మ పోస్ట్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. నెటిజన్లు రెచ్చిపోతున్నారు. వర్మను మించిన కామెంట్లు చేస్తూ హీట్ పెంచుతున్నారు. `అందులో లస్ట్ మ్యాథ్స్‌కు సంబంధించినది కొలతలు పెడుతున్నారు. `మ్యారేజ్ కామర్స్‌కు సంబంధించినది` అని, విడాకులు అనేది అన్నింటికి సంబంధించిన ఆర్ట్స్ అని, ప్రెగ్నెన్సీ బయోలజీ అని అంటూ కామెంట్లు, ట్రోల్స్ రూపంలో తెలియజేస్తూ వర్మకి సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
-
Love is about chemistry , but sex is physics
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Love is about chemistry , but sex is physics
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2021Love is about chemistry , but sex is physics
— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2021
రామ్‌గోపాల్ వర్మ.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన `డేంజరస్`, `12 o clock` అనే హర్రర్ సినిమా, `లడ్కీ` మూవీ, `కొండా` అనే సినిమాలను రూపొందిస్తున్నారు. `కొండా` మూవీ కొండా సురేఖ, కొండా మురళీ జీవితాల ఆధారంగా రూపొందిస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి మరో సాంగ్ రిలీజ్