ETV Bharat / city

Tikait at TRS Protest: 'కేసీఆర్ చేసేది... రాజకీయం కాదు.. రైతు ఉద్యమం' - తెరాస నిరసన దీక్షకు రాకేశ్ టికాయత్ మద్దతు

Rakesh Tikait About KCR : కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోంది రాజకీయం కాదు.. రైతు ఉద్యమం అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ ఉద్ఘాటించారు. రైతుల పక్షాన పోరాడుతున్న కేసీఆర్ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణకు కూడా వచ్చి పోరాటం చేస్తామని అన్నారు. దేశంలో రైతులు మరణిస్తూనే ఉన్నా కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకోకుండా కళ్లప్పగించి చూస్తోందని ఆరోపించారు.

Rakesh Tikait at TRS Protest
Rakesh Tikait at TRS Protest
author img

By

Published : Apr 11, 2022, 12:26 PM IST

Updated : Apr 11, 2022, 12:58 PM IST

కేసీఆర్ చేసేది... రాజకీయం కాదు.. రైతు ఉద్యమం

Rakesh Tikait About KCR : దేశంలో ఏం జరుగుతోంది.. రైతులు మరణిస్తూనే ఉండాలా? అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ సర్కార్ ధర్నా చేస్తోందన్న టికాయత్.. ఒక రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలో పోరాడటం కేంద్రానికి సిగ్గుచేటని అన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని చెప్పారు. కేంద్రం విధానంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని వాపోయారు.

Rakesh Tikait About TRS Protest : "తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ సీఎం చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు. రైతుల కోసం మమతాబెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు. రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్దతు ఉంటుంది. సాగుచట్టాల రద్దు కోసం దిల్లీలో 13 నెలలపాటు ఉద్యమించాం. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ.6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ.6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది. తెలంగాణలో రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. రైతుల కోసం కొట్లాడండి.. మేమే మీ వెంటే ఉంటాం. రైతుల కోసం ఉద్యమించడానికి తెలంగాణకు కూడా వస్తాం."

- రాకేశ్ టికాయత్, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత

Rakesh Tikait at TRS Protest : కనీస మద్దతు ధరపై ఏర్పాటైన కమిటీతో చర్చలు జరిపామని టికాయత్ తెలిపారు. కాలవ్యవధిపై స్పష్టత ఇచ్చేందుకు ఆ కమిటీ నిరాకరించిందని అన్నారు. రైతుల కోసం తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు చాలా గొప్పవని ఉద్ఘాటించారు. తెలంగాణలో అందిస్తున్న ఉచిత విద్యుత్ దేశమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విపక్ష సీఎం ఏకమై.. దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తాము చేస్తోంది ఓట్ల దీక్షలు కావని.. రైతు దీక్షలని స్పష్టం చేశారు.

Last Updated : Apr 11, 2022, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.