ఈరోజు వీచిన తూర్పు గాలులతో... ఉత్తర కేరళ నుంచి ఇంటీరియర్ కర్ణాటక, మరత్వాడాల మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రదేశాల్లో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
నిన్నటి రోజున మధ్యప్రదేశ్ నుంచి కోమరిన్ ప్రదేశ్ వరకు ఉన్న ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.