ETV Bharat / city

Ap Rains : చేరువలో రుతుపవనాలు.. ఏపీలో వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.

ap rains, ap rain updates, rains in ap
ఏపీలో వర్షం, ఏపీలో వానలు, ఏపీ వర్షం అప్​డేట్స్
author img

By

Published : Jun 3, 2021, 10:26 AM IST

కేరళ సముద్ర తీర ప్రాంతానికి చేరువలో నైరుతి రుతుపవనాలు సంచరిస్తున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఆలూరు మండలం కమ్మరచేడు వద్ద తాత్కాలిక వంతెన తెగింది. ఆదోని-ఆలూరు మధ్య రాకపోకలు నిలిచాయి.

ప్రకాశం జిల్లా దర్శిలో బుధవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పొదిలి రోడ్డులోని కాటేరు వాగు పొంగి వాహనాల రాకపోకలకు కొంత సేపు అంతరరాయం ఏర్పడింది.

ap rains, ap rain updates, rains in ap
రహదారులన్నీ జలమయం

వర్ష సూచన

రాయలసీమ జిల్లాల్లో ఇవాళ ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలో జల్లులు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.