ETV Bharat / city

హైదరాబాద్​లో వర్ష బీభత్సం.. పలు ప్రాంతాలు జలదిగ్బంధం - heavy rains in hyderabad

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వరదలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుంటలు తెగి కొన్ని గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. వంతెనలు కూలి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

rain effect on telangana
rain effect on telangana
author img

By

Published : Sep 19, 2020, 9:24 PM IST

మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా కురుస్తున్న వర్షాలు...లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. వరద ఉద్ధృతికి రోడ్లు తెగి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మల్కాజిగిరి, నేరెడ్‌మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గం వ్యాప్తిగా వానలు పడ్డాయి.

వాగు ఉద్ధృతికి ఒకరు బలి...

ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా తడిసి ముద్దయింది. ఎన్నడూ లేని విధంగా గత వారం రోజులుగా కురుస్తున్న వానలతో గద్వాల పట్టణం పూర్తిగా జలమయమైంది. గద్వాల-రాయచూర్‌ రహదారిపై... వంతెన నీటిలో కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయచూర్ నుంచి గద్వాలకు వెళ్తున్న లారీ వాగులో పడిపోయింది. పలు గ్రామాల్లో చెరువులకు గండిపడి పంటలు నీటమునిగాయి. జడ్చర్ల మండలం లింగంపేటలో దుందుభి వాగు వద్ద సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు...వాగులో కొట్టుకుపోయాడు.

రంగారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వానలకు షాబాద్‌ మండలంలోని ఈసీ వాగు పొంగి పొర్లుతోంది. గత ఐదేళ్లలో తొలిసారిగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శంకర్ పల్లి లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపునీరు చేరింది.

స్తంభించిన రాకపోకలు...

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కోట్ పల్లి, సర్పన్ పల్లి, లక్నాపూర్, శివసాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. కొన్ని చోట్ల కల్వర్టులు కొట్టుకుపోగా... మరికొన్ని చోట్ల రహదారిపై నీరు ప్రవహిస్తోంది. వాగులు పొంగి పొర్లి పంటపొలాల్లోకి నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: జలసిరులతో ప్రాజెక్టుల తొణికిసలు... నదుల పరవళ్లు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.