ETV Bharat / city

రెండో రోజు పర్యటనలో బిజిబిజీగా రాహుల్​.. నేతలతో విస్తృత స్థాయి సమావేశం.. - రెండో రోజు పర్యటనలో బిజిబిజీగా రాహుల్​గాంధీ.

Rahul tour Second day: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ రాష్ట్రంలో రెండో రోజు పర్యటన బిజిబిజీగా సాగుతోంది. పలువురు మీడియా అధిపతులు, ఉద్యమకారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పుంజుకోకపోవటానికి కారణాలేంటని.. అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం.. చంచల్​గూడ జైల్​లో ఉన్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలతో ములాఖాత్​ అయ్యారు.

rahul-gandhi-spending-busy-in-hyderabad-in-the-part-of-telangana-tour-second-day

author img

By

Published : May 7, 2022, 12:55 PM IST

Updated : May 7, 2022, 2:18 PM IST

Rahul tour Second day: రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఉదయం 10 గంటలకు పలువురు మీడియా అధిపతులతో రాహుల్​ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మీడియాధిపతులను అడిగి తెలుసుకున్న రాహుల్.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రజా గాయకుడు గద్దర్, హరగోపాల్, కంచె ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించడంలేదని ఉద్యమ నేతలను రాహుల్​ అడిగినట్లు తెలుస్తోంది.

rahul-gandhi-spending-busy-in-hyderabad-in-the-part-of-telangana-tour-second-day
రెండో రోజు పర్యటనలో బిజిబిజీగా రాహుల్​ గాంధీ..

అనంతరం తాజ్ కృష్ణ హోటల్ నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు. పార్కులో ఏర్పాటు చేసిన శిభిరంలో కాంగ్రెస్​ నేతలతో కాసేపు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పార్కు వద్దకు భారీగా కాంగ్రెస్​ శ్రేణులు చేరుకున్నాయి. పార్కులోకి వెళ్లేందుకు కార్యక్రర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సంజీవయ్యపార్కులో కాంగ్రెస్​ శ్రేణులతో రాహుల్​..

అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు వెళ్లిన రాహుల్​.. రిమాండ్​లో ఉన్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలతో ములాఖాత్ అయ్యారు. రాహుల్​తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ములాఖాత్​లో పాల్గొన్నారు. జైల్లో రిమాండ్​లో ఉన్న బల్మూరి వెంకట్​తో పాటు మరికొందరు కార్యకర్తలతో మాట్లాడిన రాహుల్​.. వారికి ధైర్యం చెప్పారు. అధైర్యపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. కష్టపడి పనిచేస్తుంటే పార్టీ అండగా ఉంటుందని భరోసా వారికి కల్పించారు.

చంచల్​గూడా జైల్​లో ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలతో రాహుల్​ ములాఖాత్​..

ములాఖాత్​ అనంతరం జైలు నుంచి బయటకు వస్తోన్న రాహుల్​..

చంచల్​గూడ జైలులో ములాఖాత్ ముగిశాక.. రాహుల్​గాంధీ నేరుగా గాంధీ భవన్​కు చేరుకున్నారు. పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సభ్యత్వ నమోదు సమన్వయకర్తలను రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేస్తారు. ఫొటో సెషన్​లో పాల్గొన్న తర్వాత.. రెండు రోజుల పర్యటనను ముగించుకుని రాహుల్​ దిల్లీ బయల్దేరి వెళ్తారు.

ఇవీ చూడండి:

Last Updated : May 7, 2022, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.