ETV Bharat / city

Rachakonda Sports meet: 'దేశంలోనే అత్యుత్తమ పోలీసులుగా రాచకొండ పోలీసులు' - finance principal secretary Ramakrishna rao

Rachakonda Sports meet: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ 4వ వార్షిక క్రీడల ముగింపు కార్యక్రమం సరూర్‌నగర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు టెన్నిస్, బాస్కెట్​బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో పాల్గొన్నారు.

Rachakonda Sports meet closing program in saroornagar

author img

By

Published : Dec 11, 2021, 10:25 PM IST

Rachakonda Sports meet: రాచకొండ పోలీసులను దేశంలోనే అత్యుత్తమ పోలీసుగా తీర్చిదిద్దారని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు కొనియాడారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ 4వ వార్షిక క్రీడల ముగింపు కార్యక్రమం సరూర్‌నగర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణారావు.. విజేతలకు ట్రోఫీలు, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు టెన్నిస్, బాస్కెట్​బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో పాల్గొన్నారు.

ఐఏఎస్, స్పోర్ట్స్ మీట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేసినందుకు రాచకొండ పోలీసులను రామకృష్ణారావు అభినందించారు. సీపీ మహేష్ భగవత్​తో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాచకొండలో సీపీ చేసిన సంస్కరణలు, వినూత్న పోలీసింగ్‌తో పాటు పౌరులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఆయనను అభినందించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శాంతిభద్రతలపై పౌరుల్లో ఉన్న సందేహాలన్నింటినీ తెలంగాణ పోలీసులు పటాపంచలు చేశారన్నారు.

పౌరులకు 24 గంటల పాటు అవిశ్రాంత సేవలు అందిస్తున్న పోలీసులు.. శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో పోలీసులు వృత్తి రీత్యా ఎక్కువగా వచ్చే జీవనశైలి వ్యాధులను నివారించేందుకు క్రీడలు ఎంతో అవసరమని, ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.