ETV Bharat / city

'ప్రజలు గుమిగూడే ప్రాంతాలను గుర్తించేందుకు డ్రోన్​ కెమెరాలు'

లాక్​డౌన్​ సందర్భంగా సామాజిక దూరం పాటించకుండా గుమిగూడే ప్రజలను గుర్తించేందురు డ్రోన్​ కెమెరాలను వినియోగిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించి అవసరమైతే అదనపు సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించే అవకాశం ఉందన్నారు.

rachakonda cp mahesh bhagavat speaks on drone cemeras in commiserate limits
'ప్రజలు గుమిగూడే ప్రాంతాలను గుర్తించేందుకు డ్రోన్​ కెమెరాలు'
author img

By

Published : Apr 6, 2020, 4:15 PM IST

లాక్​డౌన్​ సందర్భంగా సామాజిక దూరం పాటించకుండా గుమిగూడే ప్రజలను గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నేరెడ్​మెట్​లోని కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో డ్రోన్ కెమెరాలను ప్రారంభించి.. వాటి పనితీరును పరిశీలించారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాడీ షరీఫ్, బాలాపూర్, మౌలాలీ ఠాణా పరిధిలో వీటిని వినియోగిస్తామన్నారు. సెయింట్​ సంస్థ ఈ కెమెరాలను తయారుచేసినట్లు తెలిపారు.

క్షేత్రస్థాయి పరిస్థితులను డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించి అవసరమైతే అదనపు సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించే అవకాశం ఉందన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వాహనాలను హర్ష మోటర్స్​ సాయంతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: తెలంగాణలో కొవిడ్​ రక్తనిధి కేంద్రం?.. కిరణ్​షాకు కేటీఆర్​ ధన్యవాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.