బీసీ గురుకుల పాఠశాలల్లోని గెస్ట్ టీచర్లపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. లాక్డౌన్లో అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలిచ్చి వీరికి మాత్రం నాలుగు నెల్ల జీతాలను పెండింగ్లో పెట్టడం బాధాకరమని విమర్శించారు. హైదరాబాద్లో గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
జీతాల్లో వ్యత్యాసం..
మైనార్టీ గురుకులాల్లో 24వేల జీతం ఇస్తూ..వీరికి మాత్రం14వేలు ఇవ్వడం అన్యాయమని ఆరోపించారు. వారితో సమానంగా 24వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొదటగా.. కాంట్రాక్టు, గెస్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలన్నారు.
అన్నీ శాఖల్లో ఖాళీగా ఉన్న 2లక్షల 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరుద్యోగులను ఐక్యం చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉద్ధృతం చేస్తాం.
-ఆర్.కృష్ణయ్య