మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున జరపాలన్న నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, పీవీ మనమడు ఎన్‌వీ సుభాష్ స్వాగతించారు. ఆర్థిక సంస్కరణలను దేశంలో ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో సంస్కరణలకు పీవీ నరసింహారావు ఆధ్యులని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన గొప్ప దార్శనికుడని కొనియాడారు.
పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లు సుభాష్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు తెలంగాణకు ఎనలేని సేవలు చేశారని సుభాష్ పేర్కొన్నారు. భూ సంస్కరణలు, విద్యారంగంలో కీలక సంస్కరణలు , రెసిడెన్సియల్ పాఠశాల విద్యావిధానాలకు మూలమని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏడాది పాటు పీవీ శత జయంతి ఉత్సవాలు: కేసీఆర్