ETV Bharat / city

Punch prabhakar: 'స్వామికార్యంతోపాటు స్వకార్యం నెరవేరింది'

Punch prabhakar: సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు న్యాయ వ్యవస్థను అసభ్య, పరుష పదజాలంతో దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న పంచ్‌ ప్రభాకర్‌.. దావోస్‌లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దావోస్‌కు వచ్చి.. రాష్ట్రానికి చెందిన కార్యదర్శులను కలిసినట్లు తెలిపారు.

Punch prabhakar
Punch prabhakar
author img

By

Published : May 26, 2022, 11:53 AM IST

Punch prabhakar: సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులతో పాటు న్యాయ వ్యవస్థను అసభ్య, పరుష పదజాలంతో దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న పంచ్‌ ప్రభాకర్‌ దావోస్‌లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం తాను దావోస్‌లో ఉన్నానని.. స్వామి కార్యంతో పాటు స్వకార్యం నెరవేరిందని ఈ నెల 23న ఆయన ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దావోస్‌కు వచ్చా. ఏపీకి చెందిన కార్యదర్శులను కలిశా. నా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ తరఫున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ ఓ పెవిలియన్‌ పెట్టారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆయన ప్రతి రోజూ 5-6 గంటల పాటు వివరిస్తున్నారు. నేను నా వ్యాపార అవసరాలతో పాటు రాష్ట్రానికి చెందిన వారిని కలుద్దామని పెవిలియన్‌కు వెళ్లా. ఈ రోజు మే 23వ తేదీ. అన్ని విషయాల్లోనూ మంచే జరుగుతుంది. అందుకే జగన్‌ను కలవాలని ఆయన అభిమానులు చాలా మంది వచ్చారు’ అని పంచ్‌ ప్రభాకర్‌ ఆ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

మరోవైపు వైకాపా లోక్‌సభాపక్ష నేత, ఎంపీ మిథున్‌రెడ్డిని పంచ్‌ ప్రభాకర్‌ దావోస్‌లో కలిసి తీసుకున్న చిత్రం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఒకటి వైరల్​గా మారింది. న్యాయమూర్తులను కించపరిచేలా అసభ్య పదజాలంతో దూషించారంటూ పంచ్‌ ప్రభాకర్‌పై సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్టు చేయాలంటూ న్యాయస్థానం పలుమార్లు సీబీఐకి ఆదేశాలిచ్చింది.

ఇదీ చదవండి:

Bathini Fish Prasadam : 'ఈ ఏడాదీ చేప ప్రసాదం పంపిణీ లేదు'

'పదో తరగతికొచ్చినా.. తెలుగు, ఇంగ్లీష్ చదవలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.