ETV Bharat / city

pulichinthala: విరిగిన పులిచింతల ప్రాజెక్ట్ గేటు.. యుద్ధప్రాతిపదికన చర్యలు

పులిచింతల ప్రాజెక్టు నిర్మించి పదేళ్లు కూడా పూర్తి కాకముందే గేటు విరిగిపోవటం అధికారుల్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రమాదానికి నిర్మాణ లోపాలు కారణమా.. లేక గేట్ల అమరికలో ఏమైనా తేడాలున్నాయా అని అధికారులకు అంతు చిక్కటం లేదు. ప్రస్తుతానికి నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టిన అధికారులు.. స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరద అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

pulichinthala:
పులిచింతల ప్రాజెక్టు
author img

By

Published : Aug 6, 2021, 4:55 AM IST

Updated : Aug 6, 2021, 5:09 AM IST

ఏపీలో కృష్ణాడెల్టా స్తిరీకరణే లక్ష్యంగా 2004లో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు..2013 చివర్లో పూర్తైంది. కేవలం నీటి నిల్వకు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. శ్రీనివాస కన్‌ స్ట్రక్షన్స్‌ సంస్థ.. ఈ ప్రాజెక్టు నిర్మించగా.. దాని తరఫున బెకాన్‌ సంస్థ గేట్లు బిగించే పనులు నిర్వహించింది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 45.77 TMCలు. గతేడాది అత్యధికంగా 8లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పులిచింతలలో మొత్తం 24 గేట్లు ఉండగా నీటి ప్రవాహాన్ని బట్టి వాటిని ఎత్తేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. గురువారం తెల్లవారుజామున కూడా ఇదే క్రమంలో గేట్లు ఎత్తేందుకు యత్నించగా 16వ నంబర్‌ గేటు 4 అడుగుల మేర పైకి లేచిన తర్వాత ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందా అని చూసేలోపే గేటు విరిగి నీటిలో పడిపోయింది. ప్రమాదానికి కారణాలు ఇప్పుడే చెప్పలేమంటున్న నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌...కారణాల అన్వేషణకు కమిటీని నియమించినట్లు చెప్పారు.

పులిచింతల ప్రాజెక్టు

పులిచింతల ప్రాజెక్టు నుంచి ఒకేసారి 20 లక్షల క్యూసెక్కుల మేర నీరు విడుదలకు తగ్గట్లుగా గేట్లను డిజైన్‌ చేశారు. ఒక్కో గేటు నుంచి 80 వేల క్యూసెక్కులకు పైగా నీరు వదలవచ్చు. కానీ గేటు విరిగిన సమయంలో మొత్తం ఔట్‌ఫ్లో 50వేల క్యూసెక్కుల లోపే ఉండగా.. అప్పటికే రెండు గేట్లు ఎత్తి ఉన్నాయి. మరో 2 గేట్లు ఎత్తే క్రమంలో ప్రమాదం జరిగింది. అంటే ఎక్కువ నీటి ప్రవాహం కారణంగా గేటు విరిగిందనేందుకు అవకాశం లేదు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన గేటుకు.. అటూ, ఇటూ ఉన్న గేట్ల వద్ద.. ట్యూనియల్‌ గడ్డర్ల కాంక్రీట్‌ తొలగిపోయినట్లు కనిపిస్తోంది. అధికారులు మాత్రం నిర్మాణ లోపాలు కారణం కాకపోవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అన్నారు.

ఇప్పుడు విరిగిపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటు బిగించేందుకు.. చర్యలు మొదలయ్యాయి. ఎగువ నుంచి ప్రవాహం రావడం, ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో.. స్టాప్‌లాక్‌ గేట్‌ బిగించేందుకు శుక్రవారం సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉందని నారాయణరెడ్డి అన్నారు. మరోవైపు ప్రాజెక్టు నిర్వహణ ఎవరిదనే విషయంపై స్పష్టత కొరవడింది. నిర్మాణ సంస్థ ఇంకా ప్రాజెక్టును తమకు అప్పగించలేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు మాత్రం నిర్వహణ పనులు చేపడితే ప్రభుత్వం ఆ తర్వాత నిధులు ఇస్తుందని చెబుతున్నట్లు నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ వెల్లడించారు.

స్టాప్‌లాక్‌ ఏర్పాటుకు జలాశయంలో నీటిని ఖాళీ చేయాల్సి రావడంతో దిగువన ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ ఔట్‌ఫ్లో లక్షన్నర క్యూసెక్కులు ఉండగా..మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. నీటి ఉద్ధృతిని పర్యవేక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు ప్రకటించింది. విజయవాడలో 24 మంది సభ్యులతో ఎన్టీఆర్​ఎఫ్​ (NDRF) బృందాన్ని అందుబాటులో ఉంచారు.

ఇవీ చదవండి:

విరిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా

PULICHINTALA: తాత్కాలిక గేటు ఏర్పాటుకు 24 గంటలకు పైగా సమయం పడుతుంది

Last Updated : Aug 6, 2021, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.