ETV Bharat / city

తెల్లవార్లు డీజే.. పబ్‌ల చుట్టూ ఉండే ఇళ్ల వారికి చుక్కలే - హైదరాబాద్‌లో పబ్‌ల న్యూసెన్స్

Pubs in Hyderabad : చీకటి ముసురుకునే సమయానికి అక్కడికి పదుల సంఖ్యలో కార్లు వస్తాయి. బడాబాబులు దిగి లోపలికెళ్తుంటారు. కొందరైతే కార్లను చుట్టూ ఉన్న ఇళ్ల పరిసరాల్లో, గేట్ల ముందు నిలిపివేస్తారు. అంతా నిద్రపోతున్నవేళ చెవులు చిల్లులు పడేలా శబ్దాలు.. తెల్లారేసరికి ఇళ్ల ముందు సిగరెట్‌ పీకలు..మద్యం సీసాలు..ఇదీ పబ్‌లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌..బంజారాహిల్స్‌ సహా ఇతర ప్రాంతాల్లో జరిగే తంతు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిచేసి అలసిపోయామని, అందుకే ఫిర్యాదు చేయడమే మానేశామని స్థానికులు చెబుతున్నారు.

Pubs in Hyderabad
Pubs in Hyderabad
author img

By

Published : Apr 6, 2022, 6:48 AM IST

Pubs in Hyderabad : హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, బేగంపేట, మాదాపూర్‌, గచ్చిబౌలి.. తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో పబ్‌లున్నాయి. వీటిల్లో బంజారాహిల్స్‌ రాడిసన్‌ లాంటి స్టార్‌హోటళ్లలోని పబ్‌లలో 24 గంటలూ మద్యం సరఫరాకు అనుమతి ఉంది. మిగిలిన వాటిని రాత్రి 12 గంటలకు మూసేయాలి. వారాంతాల్లో మాత్రం రాత్రి 1గంట వరకు అనుమతిస్తారు. చట్టం ప్రకారం పబ్‌లలో శబ్దం 45 డెసిబుల్స్‌కంటే మించరాదు. జనావాస ప్రాంతాల్లోని వాటిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్దాలే ఉండకూడదనే నిబంధన ఉంది. చాలా పబ్‌లలో ఇవేమీ అమలుకావడం లేదు. తెల్లవార్లూ డీజేలతో చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లేలా హోరెత్తిస్తున్నారని, దీంతో రాత్రివేళల్లో నిద్ర కరవవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పార్కింగ్‌ సదుపాయం లేకున్నా : కొన్ని పబ్‌లకు తగినంత పార్కింగ్‌ సదుపాయం లేదు. దీంతో అక్కడికి వచ్చేవారు పరిసరాల్లోని ఇళ్ల ముందే వాహనాలు నిలిపేస్తున్నారు. ‘అర్ధరాత్రి తర్వాత తిరిగి వచ్చే కొందరు కార్ల వద్దే తాగి మద్యం సీసాలు, సిగరెట్‌ పీకలు, ఖాళీ మత్తుపొట్లాలు అక్కడే వదిలేస్తున్నారు. కొందరైతే మత్తు ఎక్కువై అక్కడే పడిదొర్లడం, వాంతులు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. రోజూ శుభ్రం చేయించుకోలేక అల్లాడుతున్నాం. గేట్ల ముందు కార్లు నిలపడంతో ఒక్కోసారి అత్యవసరమైతే ఇళ్లలోని కార్లు బయటకు తీయలేకపోతున్నామని’ స్థానికులు వాపోతున్నారు.

Pubs Nuisance : ‘నేను విశ్రాంత ఐఏఎస్‌ అధికారిని. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఉంటున్నా. ఫిర్యాదు చేసినప్పుడల్లా పోలీసులు పెట్టీ కేసు నమోదు చేసేవారు తప్ప సమస్యకు పరిష్కారం లభించలేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులకు ఫిర్యాదుచేసి విసిగిపోయిన జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌(క్లీన్‌ అండ్‌ గ్రీన్‌) అసోసియేషన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పబ్‌ల నిర్వహణకు, మద్యం సరఫరాకు ఇతర శాఖలు అనుమతులిస్తుంటే.. ఫిర్యాదులు మాత్రం తమకొస్తున్నాయని పోలీస్‌ అధికారులు పెదవి విరుస్తుండటం గమనార్హం.

తెల్లవార్లూ అనుమతుల పేరిట వల : హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం విస్తరిస్తోండటంతో విదేశాల నుంచి ఆయా సంస్థల ప్రతినిధులు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి ప్రతినిధులకు ఆతిథ్యమివ్వాలనే ఉద్దేశంతో గతంలో కొన్ని స్టార్‌ హోటళ్లలో 24 గంటల మద్యం విక్రయాలకు అనుమతులిచ్చారు. ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని కొన్ని పబ్‌లను ఇలాంటి హోటళ్లలోనే ఏర్పాటుచేశారు. తమకు 24 గంటల మద్యం సరఫరా అనుమతులున్నాయంటూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నారు. ‘వారాంతంలో రెండు రోజులపాటు వీలైనంత ఎక్కువ మంది వినియోగదారులను రప్పించగలిగితే నెలలోనే రూ.కోటికిపైగా గడించే అవకాశముంది. అందుకే నిర్వాహకులు పెట్టీ కేసుల్ని లెక్క చేయడం లేదు. తమ దందాను చూసీచూడనట్లు వదిలేసేందుకు కొందరు అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణలపైనే పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టిసారించినట్టు’ ఆ వర్గాల సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.