నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష, తెజస పార్టీలు రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చాయి. అఖిల భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు హయత్నగర్ ఆర్టీసీ డిపో వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సహా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజీవ్ రహదారి, అల్వాల్ ఈ-సేవాకేంద్రం వద్ద, వరంగల్ హైవే బోడుప్పల్ బస్ డిపో వద్ద రహదారుల దిగ్బంధం నిర్వహిస్తున్నట్లు భారత కిసాన్ సంఘర్షణ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పశ్యపద్మ ప్రకటించారు.
ఇవీచూడండి: సభాముఖంగా సాగు చట్టాలపై మోదీ ప్రసంగం!