ETV Bharat / city

పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపు!

తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను పెంచేందుకు పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. పురపాలికలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

property tax hike in cities and urban areas in telangana
పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపు!
author img

By

Published : Mar 19, 2020, 8:50 AM IST

రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంపుపై పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన 12 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను రూపంలో రూ.672 కోట్లు వసూలవుతోంది. వసూళ్లు పెంచుకునేందుకు పలు విధానాలను అనుసరించినా పెరుగుదల స్వల్పంగానే ఉంటోంది.

ఈ నేపథ్యంలో పురపాలక సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందేలా ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపుపై దృష్టి సారించింది. ఎంత పెంచాలనే కోణంలో వివిధ ప్రాతిపదికలపై పురపాలకశాఖ అధ్యయనం చేస్తోంది. చాలా కాలంగా ఆస్తిపన్ను పెంచలేదని, పురపాలక సంఘాల కార్యకలాపాలు విస్తృతం కావడం వల్ల సొంత నిధుల సమీకరణకు ఆస్తిపన్ను కీలకమని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

గ్రామ పంచాయతీల నుంచి కొత్తగా వర్గోన్నతి పొందిన 56 పురపాలక సంఘాల్లో మూడేళ్ల పాటు ఆస్తిపన్ను పెంపు ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పురపాలక సంఘాలు 2018 ఆగస్టులో ఏర్పాటయ్యాయి. వీటిలో వచ్చే ఏడాది ఆగస్టు లోపు ఆస్తిపన్ను పెరగదని సమాచారం. పూర్వపు పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో మాత్రం 12 లక్షలకు పైగా ఆస్తులు ఉన్నాయి.

అవన్నీ వాణిజ్య కేటగిరీలోకే

ప్రధానంగా గృహావసరాల కేటగిరీలో నమోదు చేసుకుని తక్కువ ఆస్తిపన్ను చెల్లిస్తూ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేలాది భవనాల ద్వారా భారీగా రాబడి పెంచుకునే అవకాశం ఉందని గుర్తించారు.

భవనాలను పూర్తిగా లేదా పాక్షికంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నా వాటిని వాణిజ్య కేటగిరీలో చేర్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా, సమర్థ విధానాలతో రాబడి పెంచడమే ముఖ్య ఉద్దేశమని ఒక ఉన్నతాధికారి వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.