ETV Bharat / city

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్‌ - మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్‌

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ నాగేశ్వర్​కు బెదిరింపు ఫోన్​కాల్​ వచ్చింది. గత నెల 25న ఇంటర్నెట్​ వాయిస్​ బేస్డ్​ కాల్​ చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Professor and former MLC  nageshwar threatened to warning call
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్‌
author img

By

Published : Aug 6, 2020, 5:01 PM IST

Updated : Aug 6, 2020, 6:21 PM IST

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్​కు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. గత నెల 25న తనను చంపుతానంటూ ఇంటర్నెట్ వాయిస్ కాల్ నుంచి ఆగంతుకుడు ఫోన్ చేశారని కె.నాగేశ్వర్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దూషించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని డీజీపీ, సీపీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్లు అందుబాటులోకి రాలేదని... చివరికి హాక్ ఐ ద్వారా ఫిర్యాదుచేసినట్లు తెలిపారు.

డీజీపీ అందుబాటులోకి రాలేదు..

12 రోజులైనా తన ఫిర్యాదుపై ఎలాంటి పురోగతి లేదని.... మాజీ ఎమ్మెల్సీగా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సామాన్యుల సంగతేంటని నాగేశ్వర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.... రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తానని కె. నాగేశ్వర్ స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు బెదిరింపు కాల్‌

ఇవీచూడండి: రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వరవరరావును విడిపించాలి : ఐక్యవేదిక

Last Updated : Aug 6, 2020, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.