ETV Bharat / city

రాష్ట్రంలో మూడు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు.. కొత్త సంవత్సరానికి పూర్తి! - తెలంగాణ అమరవీరు స్మారకం

Prestigious Structures in hyderabad: మూడు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను కొత్త సంవత్సరంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త సచివాలయం, అమరవీరుల స్మారకంతో పాటు అంబేడ్కర్‌విగ్రహం పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. దాదాపు అన్ని పనులు పూర్తి కావస్తున్నాయి.

Prestigeous Structures
ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు
author img

By

Published : Oct 8, 2022, 9:46 AM IST

హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు

Prestigious Structures in hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపట్టింది. ఆధునిక సొబగులతో సచివాలయ సౌధం, తెలంగాణ కోసం అసువులు బారిన వారిని నిత్యం స్మరించుకునేలా అమరవీరుల స్మారకం, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సచివాలయానికి సంబంధించి ఎలివేషన్ పనులు కొసాగుతుండగా... అమరవీరుల స్మారకంలో వెల్డింగ్, ఇతర పనులు జరుగుతున్నాయి. అంబేడ్కర్‌విగ్రహానికి సంబంధించి సివిల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

సచివాలయం.. పాత సచివాలయాన్ని కూల్చి వేసిన సర్కార్... అదే స్థలంలో విశాలంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త సచివాలయ భవనాన్ని నిర్మిస్తోంది. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భవనం పనులు గత రెండున్నరేళ్లుగా రాత్రి, పగలు సాగుతున్నాయి. వేలాది మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన సివిల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. పై భాగాన ఇతర డోమ్‌ల పనులు దాదాపుగా పూర్తి కాగా... మధ్యలో నిర్మించాల్సిన రెండు డోమ్‌ల పనులు ప్రారంభించాల్సి ఉంది.

భారీ ఆకృతులు కావడంతో ఆ పనులు జాగ్రత్తగా, ఆచితూచి చేయాల్సి ఉంటుందని ఆర్​ అండ్​ బీ వర్గాలు చెప్తున్నాయి. రాజస్థాన్‌ నుంచి తీసుకొచ్చిన ఎర్రటి ఇసుక రాయితో భవనం ముందు భాగం ఎలివేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం రాజస్థాన్ నుంచి కూలీలను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆ పనులు కొనసాగుతున్నాయి. భవనం లోపల సమాంతరంగా ఇంటీరియర్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇతర పనులను కూడా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ నెలఖారు వరకు పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు.

అమరవీరుల స్మారకం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అమరులైన వారిని నిత్యం సర్మించునేలా హుస్సేన్ సాగర్ తీరాన అమరవీరుల స్మారకాన్ని నిర్మిస్తున్నారు. అమరుల స్ఫూర్తి నిత్యం జలించేలా ఉండేలా దీపం ఆకృతిలో ప్రత్యేక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కింద భవనాన్ని కూడా వినూత్నంగా నిర్మిస్తున్నారు. పూర్తిగా స్టెయిన్ లెస్ క్లాడింగ్‌తో స్మారకాన్ని నిర్మిస్తున్నారు. క్లాడింగ్ కోసం అవసరమైన స్టీల్‌ను జర్మనీ నుంచి తీసుకొచ్చారు. దుబాయ్‌కు చెందిన సంస్థ.. ఈ పనులు చేస్తోంది. క్లాడింగ్ పనులు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులకే ఇంకా నెలరోజులకు పైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత మిగతా పనులు వేగంగా పూర్తి చేయవచ్చని చెప్తున్నారు. భవనం లోపల గ్రంథాలయం, సమావేశ మందిరం, రెస్టారెంట్ కూడా నిర్మిస్తున్నారు.

అంబేడ్కర్​ విగ్రహం.. హుస్సేన్ సాగర్ తీరాన మరో ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. దిల్లీలో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. విడిభాగాలుగా ఇక్కడకు తీసుకొచ్చి అమరుస్తున్నారు. ఆ పనులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ నమూనాలో ఓ భవనాన్ని నిర్మించి దానిపై అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పుతారు. నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. విగ్రహంతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు. అంబేడ్కర్‌ పేరిట ప్రత్యేక పార్కును కూడా అభివృద్ధి చేయనున్నారు. కరోనా, వివిధ ఇతర కారణాల వల్ల ఆలస్యమైన మూడు ప్రతిష్టాత్మక నిర్మాణాలను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.