తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. వేద సత్కారం అందుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ బిశ్వభూషణ్ ఉన్నారు.
మధ్యాహ్నం 1.05 గంటలకు తిరుమలలోని వరాహస్వామి ఆలయాన్ని.. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రాష్ట్రపతి దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద ఇస్తెకఫాల్ స్వాగతం పలికారు. సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి చెన్నై తిరిగి పయనమవుతారు. రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'హిందువా.. ముస్లిమా అనవసరం- మేజర్లా.. కాదా?'