ఏపీలోని ఒంగోలులోని పోలీసు శిక్షణా కేంద్రంలో.. కరోనా సోకిన పోలీసులు, వారి కుటుంబసభ్యులకు చికిత్స అందిస్తున్నారు. శిక్షణా కేంద్రంలోని కొవిడ్ సెంటర్లలో ఉన్నవారి మానసిక ఆరోగ్యానికి ప్రకాశం జిల్లా పోలీసులు.. పలు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సంగీత విభావరి, మహిళలకు రంగవల్లుల పోటీలు, యోగా, ధ్యానం వంటివి చేపట్టారు. మానసికంగా దృఢంగా ఉంటే కరోనాను జయించొచ్చన్న దృక్పథంతో వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఇవీచూడండి: ప్రైవేట్ సంస్థల్లో వాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి