ETV Bharat / city

పోలీసులపై కోపంతో రెండు ఠాణాల్లో కరెంట్​ కట్​ - jeedimetla latest news

మేడ్చల్​ జిల్లా జీడిమెట్లలోని రెండు పోలీస్​స్టేషన్​లలో రెండున్నర గంటలపాటు విద్యుత్​కు అంతరాయం కలిగింది. అదేదో సాంకేతిక సమస్యో... మరమ్మతుల కారణంగానో కాదు. పోలీసులపై విద్యుత్​ ఔట్​సోర్సింగ్​ కార్మికుడికి వచ్చిన కోపం వల్ల..! అసలు అతడికి కోపం ఎందుకు వచ్చిందో చూడండి.

power cut in jeedimetla police station for anger on police

author img

By

Published : Feb 2, 2021, 10:53 PM IST

పోలీసులపై కోపం తెచ్చుకున్న ఓ విద్యుత్​ కార్మికుడు రెండు ఠాణాల్లో కరెంటు తీసేశాడు. మేడ్చల్​ జిల్లా షాపూర్​ నగర్​లో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో బన్నీ(17) పట్టుబడ్డాడు. జీడిమెట్ల విద్యుత్​ కార్యాలయంలో ఔట్​ సోర్సింగ్​ కార్మికుడిగా పనిచేస్తోన్న తన తండ్రి రమేశ్​కు ఫోన్​ చేసి తనను పట్టుకున్నారని చెప్పాడు.

సదరు ట్రాఫిక్ ఎస్సైతో రమేశ్ మాట్లాడగా.. విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. పోలీసులపై కోపం తెచ్చుకున్న రమేశ్​... జీడిమెట్ల పీఎస్, జీడిమెట్ల ట్రాఫిక్ పీఎస్​లో కరెంటు కట్ చేశాడు. సుమారు రెండున్నర గంటల పాటు పీఎస్​లు అంధకారంలోనే ఉన్నాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటం వల్ల విద్యుత్​ను పునరుద్ధరించాడు.

ఈ ఘటనపై విద్యుత్ డీఈని వివరణ కోరగా... కరెంటు తీసేసిన మాట వాస్తవమే అని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: మరణం కమ్మేసినా.. మరొకరిలో మళ్లీ బతికాడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.