ETV Bharat / city

'ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇంత దారుణమా?' - ponnam prabhakar on praveen yadav

హుజురాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రి కంప్యూటర్​ ఆపరేటర్​​ ప్రవీణ్​ యాదవ్​ మృతిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం డిమాండ్​ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.

ponnam
మంత్రి ఈటల సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలా..: పొన్నం
author img

By

Published : Aug 31, 2020, 3:54 PM IST

ప్రవీణ్​యాదవ్​ మృతిపై పూర్తస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ నేత పొన్నం ప్రభాకర్​ డిమాండ్​ చేశారు. కరీంనగర్​ జిల్లా హుజురాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్​ వేధింపులతోనే.. కంప్యూటర్​ ఆపరేటర్​​ ప్రవీణ్​యాదవ్​ మృతి చెందినట్లు పొన్నం ఆరోపించారు. ​ఓ అమాయకుడిని బలిచేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆస్పత్రుల సందర్శన సందర్భంగా.. హుజురాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​పై కేసునమోదు చేయాలని డిమాండ్​ చేసినట్లు తెలిపారు. రివర్స్​లో తమ పార్టీ నేతలపైనే కేసు పెట్టారని మండిపడ్డారు.

ఈ సమస్యలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, మానవహక్కుల కమిషన్‌ను కలుస్తామని పొన్నం వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్నారు.

మంత్రి ఈటల సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలా..: పొన్నం

ఇవీచూడండి: 'అందుకే 139 మందిపై కేసు పెట్టా... ప్రదీప్​ అమాయకుడు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.