ETV Bharat / city

Hyderabad rains :ప్రమాదకరంగా 50 చెరువులు.. ముంపు భయంలో కాలనీలు

author img

By

Published : Jul 23, 2021, 7:22 AM IST

చినుకు ఆగడం లేదు.. చెరువులు నిండుకుండలై తొణికిసలాడుతున్నాయి. ఎప్పుడు ఏ చెరువు.. కట్టలు తెంచుకుంటుందో.. ఎన్ని కాలనీలు వరద ముంపులో చిక్కుకుపోతాయో అంతుపట్టని పరిస్థితి నెలకొని ఉంది. హైదరాబాద్​ మహానగరంలో 50 చెరువులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

ప్రమాదకరంగా 50 చెరువులు
ప్రమాదకరంగా 50 చెరువులు
గత వర్షాల నుంచి తట్టిఅన్నారం చెరువు పరిధిలో ఇంకా నీటి ముంపులోనే ఉన్న హనుమాన్‌ నగర్‌

గత ఏడాది భారీ వర్షాలకు చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. ఈ దఫా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జులై నెలలోనే పొంగిపొర్లుతూ ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. గతంలో అర్ధరాత్రి వేళ భారీగా వరద నీరు చేరి విలయం సృష్టించిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడూ అదే భయంతో అనేక లోతట్టు ప్రాంతవాసుల్లో కంటిమీద కునుకు కరవైంది. రెండు వారాలుగా హైదరాబాద్​ మహా నగరంలో సగటున 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరో నాలుగైదు సెంటీమీటర్లు పడితే 50 చెరువుల పరిధిలో కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

సమస్య ఏంటంటే: ఒక అద్భుత ప్రణాళికతో చెరువులను నిర్మించిన చరిత్ర నగరానికి ఉంది. గొలుసుకట్టు తరహాలో వీటి నిర్మాణం సాగింది. ఒకదానితో ఒకటి అనుసంధానం కావడం వల్ల ఒక చెరువు నిండగానే కింది చెరువుకు అదనపు నీరు వెళ్లేది. ఏళ్లుగా ఈ నాలాలు ఆక్రమణలకు గురై అదనపు నీరు కింది చెరువుల్లోకి వెళ్లే మార్గాలు మూతపడ్డాయి.

ప్రభుత్వం ఏం చెప్పిందంటే: వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఎన్‌డీపీ) కింద నాలాల రూపు మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిధుల సమస్యతో పనులు ముందుకు సాగడం లేదు. అక్కడక్కడ కట్టలు వెడల్పు చేసినా పనులు నాసిరకంగా సాగాయి.

ఇప్పటికే బురాన్‌ఖాన్‌ చెరువులో పూర్తిస్థాయి నీటి మట్టం నీరు చేరింది. సమీపంలోని ఉస్మాన్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం ముంపు నీటిలో ఉన్నాయి.

వనస్థలిపురం సమీపంలోని కప్రాయ్‌ చెరువు పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. 20 కాలనీల్లో రహదారులపైకి నీరు చేరింది. వరద నీటి మళ్లింపు చేపట్టకపోతే హరిహరపురం ముంపు బారిన పడనుంది.

తూర్పు ఆనంద్‌బాగ్‌లోని బండచెరువు సుమారు 35 ఎకరాల్లో ఉంది. ఆర్కేపురం చెరువు నుంచి సఫిల్‌గూడ చెరువు.. అక్కడి నుంచి బండ చెరువులోకి వరద నీరు ప్రవహిస్తుంది. పూడికతో పాటు అస్తవ్యస్త నాలాల కారణంగా బండ చెరువు నుంచి వస్తున్న వరద నీరు ఐదు కాలనీలను ముంచెత్తుతోంది. గత వారం కిందటి వర్షాలకు షిర్డీనగర్‌, ఎన్‌ఎండీసీ కాలనీల్లో నాలుగు నుంచి ఐదు అడుగుల నీరు చేరింది. ఎప్పటికప్పుడు చెరువు నుంచి నీటిని విడుదల చేస్తున్నా కాలనీలకు ముంపు తప్పడం లేదు.

మీర్‌పేట పెద్ద చెరువు, మంత్రాల చెరువు ఇప్పటికే నీటితో నిండిపోయాయి. వారం రోజుల కిందట కురిసిన భారీ వానలకు మిథిలా నగర్‌ సహా మరో పది కాలనీలకు ముప్పు పొంచి ఉంది. చందన చెరువు ఇప్పటికే పొంగుతోంది.

నిండా నీళ్లలోనే: బండ్లగూడలో ఇళ్లు ఖాళీ చేసి పోవడంతో ఖాళీగా ఉన్న గృహాలు

బండ్లగూడ చెరువు వరద కారణంగా అయ్యప్ప కాలనీ ముంపులోనే ఉంది. మళ్లీ భారీ వర్షాలొస్తే కాలనీలోని మిగిలిన ఇళ్లతో పాటు మల్లికార్జున నగర్‌ ఫేజ్‌-1, 2 ముంపునకు గురి కానున్నాయి.

రామంతాపూర్‌ పెద్ద చెరువు, చిన్న చెరువు సైతం నిండిపోయాయి. ఇప్పటికే మోటార్లు పెట్టి నీటిని బయటకు విడిచి పెడుతున్నారు. చిన్న చెరువు తూముల సామర్థ్యం సరి పోవడం లేదు.

ఎర్రగుంట చెరువు: నాచారంలో ఆక్రమణకు గురైన నాలా. ఇళ్ల మధ్య నుంచి వెళుతున్న వరద

జల్‌పల్లి పెద్ద చెరువు, పల్లె చెరువు నిండిపోవడంతో మళ్లీ భారీ వర్షాలొస్తే జల్‌పల్లి రహదారిపై నీరు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచి ఉందా సాగర్‌కు నీరు చేరుతుండటంతో గతేడాది తరహాలో పాతబస్తీలోని బాబా నగర్‌కు ముప్పు పొంచి ఉంది.

జీడిమెట్ల సమీపంలో ఫాక్స్‌ సాగర్‌ నిండిపోయింది. గతేడాది ఉమామహేశ్వర కాలనీ సహా పలు కాలనీలు మునిగిపోయాయి. తూములకు మరమ్మతులు చేయకపోవడంతో పరిస్థితి యథాతథంగా ఉంది.

హయత్‌నగర్‌ బాతుల చెరువు: అలుగుపారి కోతకు గురవుతున్న రహదారి

హయత్‌ నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరికుంట ప్రమాదకరస్థితికి చేరాయి. అంబేడ్కర్‌బస్తీ, రంగనాయకుల గుట్ట, బంజారా కాలనీ, తిరుమల కాలనీకి ముప్పు పొంచి ఉంది. బాతుల చెరువు నుంచి నీరు బయటకు పోవాల్సిన మార్గంలో రెండు తూములు, అలుగు పూడుకుపోయాయి. పెద్దఅంబర్‌పేట ఈదుల చెరువులోకి వెళ్లేందుకు వీల్లేక బస్తీలు మునిగే స్థితికి చేరుకున్నాయి.

రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువు కట్టను రూ.20 లక్షల వ్యయంతో విస్తరించగా నెల రోజుల కిందటి వానలకే కోతకు గురైంది. వాస్తవానికి గతేడాది ఈ కట్ట తెగి కర్నూలు జాతీయ రహదారి కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ప్రస్తుతం ఈ చెరువు నిండి మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.