ETV Bharat / city

డిప్లొమానూ కమ్మేస్తున్న కంప్యూటర్‌ సైన్స్‌ - Computer Science Course

Computer Science Course : నేటి ఆధునిక కాలంలో బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత బ్రాంచీలదే హవా నడుస్తుండగా.. తాజాగా డిప్లొమా కళాశాలల యాజమాన్యాలు అదే బాటలో నడుస్తున్నాయి. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తుండటంతో విద్యార్థులు ఆ బ్రాంచీల్లోనే చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే పలు కళాశాలలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లను తగ్గించుకొని.. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.

Diploma in Computer Science
Diploma in Computer Science
author img

By

Published : Jul 21, 2022, 8:14 AM IST

Computer Science Course : బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత బ్రాంచీలదే హవా నడుస్తుండగా.. తాజాగా పాలిటెక్నిక్‌లోనూ కళాశాలల యాజమాన్యాలు అదే బాటలో పయనిస్తున్నాయి. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తుండటంతో విద్యార్థులు ఆ బ్రాంచీల్లోనే చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే పలు కళాశాలలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లను తగ్గించుకొని.. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.

బీటెక్‌ సీట్లలో ప్రాధాన్యమే కారణం.. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసిన వారిలో 80 శాతానికిపైగా ఈసెట్‌ రాసి.. బీటెక్‌లో రెండో సంవత్సరం(లేటరల్‌ ఎంట్రీ)లో చేరుతున్నారు. బీటెక్‌లో 60 సీట్లుంటే రెండో ఏడాదిలో ఆరు సీట్లు(10శాతం)పెంచి వాటిని డిప్లొమా విద్యార్థులకు కేటాయిస్తారు. బీటెక్‌ సీఎస్‌, ఏఐ అండ్‌ ఎంఎల్‌లో చేరాలంటే డిప్లొమాలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివిన వారికి తొలిప్రాధాన్యం ఇస్తారు. అప్పటికీ సీట్లు మిగిలితే ఇతర బ్రాంచీల వారికి కేటాయిస్తారు.

కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లలో 40% పెరుగుదల.. రాష్ట్రంలో 125 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉండగా 26 డిప్లొమా బ్రాంచీల్లో 30,032 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

  • గత ఏడాది డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ)లో 3,280, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ అండ్‌ ఎంఎల్‌) 60, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌డేటా-60 సీట్లున్నాయి. సీఎస్‌ తప్ప మిగిలిన రెండు కోర్సులూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోనే గత విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
  • ఈసారి 20 ప్రైవేట్‌ కళాశాలల్లో పాత కోర్సులను మూసివేయడం లేదా వాటిల్లో సీట్లు తగ్గించుకుంటే ఆమేరకు కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, ఏఐ అండ్‌ ఎంఎల్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఈ మూడింట్లో 1,500 సీట్లు పెరగనున్నాయి. వాటిల్లో 1,300 వరకు సీఎస్‌ఈ సీట్లే ఉండటం గమనార్హం. అంటే ఈసారి 40 శాతం సీట్లు పెరుగుతున్నాయి. మరో కళాశాలలో బిగ్‌ డేటా(60 సీట్లు), రెండు కళాశాలల్లో కృత్రిమ మేధ(120 సీట్లు) కోర్సులు రానున్నాయి.
  • కొన్నిచోట్ల మెకానికల్‌, సివిల్‌ లాంటి బ్రాంచీల్లో 60 సీట్లుంటే 30కి తగ్గించారు. మిగిలినవి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో పెంచుకున్నారు.
  • ‘పూర్తిగా బ్రాంచీలను మూసివేయడానికి ఏఐసీటీఈ అంగీకరించడం లేదు. అందుకే 30 సీట్లు ఉంచుకొని మిగిలిన వాటిస్థానంలో కొత్త కోర్సులకు అనుమతులు తెచ్చుకుంటున్నారు’ అని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కార్యదర్శి సి.శ్రీనాథ్‌ వ్యాఖ్యానించారు. ఈ ఏడాదీ మొత్తం 30 వేల సీట్లే ఉంటాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.