ETV Bharat / city

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరు నెలల జైలు! - delhi government

ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోన్న వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దిల్లీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూష‌న్ స‌ర్టిఫికెట్​ను వాహనదారులకు త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీ సమయంలో స‌ర్టిఫికెట్ చూపించకపోతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా లేదా రెండూ ఉంటాయని తెలుస్తోంది.

pollution certificate
pollution certificate
author img

By

Published : Nov 1, 2021, 9:35 PM IST

దిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూష‌న్ అండర్​ కంట్రోల్ స‌ర్టిఫికెట్​ను వాహనదారులు త‌ప్ప‌నిస‌రిగా ద‌గ్గ‌ర ఉంచుకుని తనిఖీ సమయంలో చూపించాలని.. లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా లేదా రెండూ ఉంటాయని పేర్కొంటూ దిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స‌ర్టిఫికెట్ లేకుంటే లైసెన్స్‌ను 3నెల‌ల పాటు ర‌ద్దు చేస్తామని హెచ్చ‌రించినట్లు తెలుస్తోంది.

దేశ రాజధానిలో క‌రోనా లాక్​డౌన్ సమయంలో వాయుకాలుష్యం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయినప్పటికీ... లాక్‌డౌన్ అనంతరం మళ్లీ పెరుగుతూ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్ నిబంధనను తప్పనిసరి చేసింది.

దీ చూడండి: లారీ ఢీకొని నుజ్జునుజ్జయిన కారు- నవదంపతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.