ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి వారధి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ క్లబ్లో వసతి కల్పించినప్పటికీ వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడంపై పోలీసులు కన్నెర్ర జేశారు. విజయవాడ నుంచి తాడేపల్లికి వస్తున్నారని కార్మికులపై లాఠీఛార్జ్ చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాల మేరకు వలస కూలీలను కొద్దిరోజుల క్రితం విజయవాడ క్లబ్‌కు తరలించారు. అయితే వారు అక్కడ ఉండకుండాా స్వస్థలాలకు వెళ్లేందుకు సైకిళ్లపై బయలుదేరారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి వారధి వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డగించారు. పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించినా వారు వినలేదు. ఆగ్రహించిన పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా కొట్టటంతో వలసదారులు భయంతో పరుగులు తీశారు.
ఇదీ చదవండి: వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైలు