ETV Bharat / city

చిన్నారులు రోజంతా పోలీస్ స్టేషన్​లోనే.. కారణం ఏంటి! - childrens in piduguralla police station

అభం శుభం తెలియని చిన్నారులను పోలీసులు మధ్యాహ్నం నుంచి స్టేషన్​లోనే ఉంచారు. వారు ఏదో పెద్ద నేరం చేశారని భావిస్తే మీరు పొరపడినట్లే. ఎందుకంటే కేవలం వారు చేసింది ఆడుకుంటూ వెళ్లి ఫ్లెక్సీలను చించడమే! అదేంటి ఫ్లెక్సీలు చించితేనే స్టేషన్​కి తీసుకెళ్తారా అనే సందేహం ఉందా ? అయితే ఇది చదవండి..

police station
police station
author img

By

Published : Apr 26, 2022, 7:50 PM IST

అభంశుభం తెలియని విద్యార్థులను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోలీస్​స్టేషన్​లో ఉంచిన ఘటన ఏపీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. పార్టీ ఫ్లెక్సీలను చించారని ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ చిన్నారులను స్టేషన్​కి తీసుకెళ్లారు. పోలీసులను చూసి భయపడిన చిన్నారులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ స్టేషన్​లో గడిపారు. చివరకు స్థానిక నాయకుల పూచీకత్తుతో ఇంటికి పంపారు. పిల్లలను పోలీస్​స్టేషన్​లో ఉంచడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు.

వైకాపా అరాచక పాలనకు నిదర్శనం...

ఆడుకుంటూ ఫ్లెక్సీ చింపారని విద్యార్థులను రోజంతా స్టేషన్​లో ఉంచడం వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని లోకేశ్​ మండిపడ్డారు. వైకాపా నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టిన వైకాపా నేతలు, ఇప్పుడు ఏకంగా చిన్నారులను పోలీస్ స్టేషన్​లో పెట్టి వికృత ఆనందం పొందుతున్నారని విమర్శించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్​లో పెట్టి బెదిరించడమా? అని నారా లోకేశ్​ నిలదీశారు. బాలల హక్కులు కాలరాసే విధంగా చోటుచేసుకున్న ఈ ఘటన పై విచారణ జరిపి, విద్యార్థులను వేధించడానికి కారణమైన వైకాపా నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

  • ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించడమా @ysjagan గారు? వైసిపి నాయకుల పైశాచికత్వానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకూ ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నేతలు..,(1/3) pic.twitter.com/FZd8Uiv0fU

    — Lokesh Nara (@naralokesh) April 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.