తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భాజపా, తెరాసాయేతర పార్టీలు.. నేడు ఇందిరా పార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 17 షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు సెంట్రోల్ జోన్ జాయింట్ కమిషనర్ పి.విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్దేశిత సమయంలోనే మహాధర్నాను ముగించాలని పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలకు లోబడి మహాధర్నా నిర్వహించుకోవాలని, రెండు వందల మందికి మించకుండా చూడాలని నిర్వహకులకు పోలీసులు స్పష్టం చేశారు. ధర్నా కార్యక్రమంలో ప్రేరేపిత నినాదాలు కాని, వ్యాఖ్యలు కాని ఉండరాదని పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్దనే కార్యక్రమం ఉండేట్లు నిర్వహకులు చర్యలు తీసుకోవాలని... అక్కడ నుంచి ర్యాలీ నిర్వహణకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. డ్రోన్ కెమెరాలు వాడరాదని, ప్రజ రవాణాకు ఇబ్బంది కలిగించొద్దని వివరించారు.
ఇదీ చదవండి: Puppalaguda land auction: పుప్పాలగూడలో ఐదు ప్లాట్ల వేలంపై హైకోర్టు స్టే