దిశ అత్యాచార కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను షాద్ నగర్ పోలీసులు 10 రోజుల కస్టడీ కోరారు. ఈకేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శ్యాంప్రసాద్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై అంత్యంత గోప్యత పాటిస్తున్నారు పోలీసులు.నిందితుల భద్రత దృష్ట్యా ఏ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ కేసులో నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.