ETV Bharat / city

సందీప్‌, పండు మధ్య ఏం జరిగిందో తేల్చేదిదే!

విజయవాడ నగరంలో జరిగిన గ్యాంగ్ వార్ దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సందీప్ భార్య.. తన భర్త హత్య వెనక రాజకీయ కోణం ఉందని ఆరోపించటంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్‌కాల్‌ రికార్డులను పోలీసులు పరిశీలించగా.. గ్యాంగ్‌వార్‌ జరగడానికి కొద్దిసేపటి ముందు సందీప్‌ పండుకు కాల్‌ చేశాడని తేలినట్టు సమాచారం.

author img

By

Published : Jun 5, 2020, 7:00 PM IST

సందీప్‌, పండు మధ్య ఏం జరిగిందో తేల్చేదిదే!
సందీప్‌, పండు మధ్య ఏం జరిగిందో తేల్చేదిదే!

బెజవాడలో కలకలం సృష్టించిన గ్యాంగ్‌వార్‌ దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్లు, వ్యక్తిగత వైరం, ఆధిపత్య పోరు ఈ గ్యాంగ్‌వార్‌కు ప్రధాన కారణమని పోలీసులు ఇప్పటివరకూ భావించారు. తాజాగా సందీప్‌ భార్య తేజస్విని.. తన భర్త హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ అనడంతో ప్రస్తుతం కేసు మరో మలుపు తిరిగింది. మరిన్ని వివరాల కోసం సందీప్‌, పండుల మధ్య జరిగిన ఫోన్‌ కాల్‌ రికార్డులపై దృష్టిపెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 45మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. ఘర్షణకు ముందు సందీప్‌ ఇనుప దుకాణం వద్ద నుంచి ఎవరెవరు బయలుదేరి వెళ్లారనేది తెలియకుండా ఉండేందుకు సీసీ కెమెరాను ఆపేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతకుముందు పండు వచ్చి అక్కడ గొడవ చేసిన ఫుటేజీ మాత్రమే పోలీసులకు దొరికినట్టు సమాచారం.

ప్రదీప్‌ అన్న పిలిస్తేనే వచ్చా..

ఫోన్‌కాల్‌ రికార్డులను పోలీసులు పరిశీలించగా.. గ్యాంగ్‌వార్‌ జగడానికి కొద్దిసేపటి ముందు సందీప్‌ పండుకు కాల్‌ చేశాడని తేలినట్టు సమాచారం. ‘నాగబాబు అన్న నేను సెటిల్‌మెంట్లో ఉంటే నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావ్‌. నాగబాబు అన్న ఉంటే.. నేనే బయట ఉంటాను. అలాంటిది నువ్వు ఎందుకు వచ్చావ్‌’ అంటూ నిలదీశాడు. ‘ప్రదీప్‌ అన్న పిలిస్తే వచ్చాను. అంతేగానీ నేనేమీ లీడర్‌ అవుదామని, డబ్బులు వస్తాయని రాలేదు.’. అంటూ పండు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, దుర్భాషలాడుకోవడం జరిగింది. మగాడివైతే ఎక్కడున్నావో చెప్పు వస్తా అంటూ సందీప్‌ అన్నాడు. దీంతో తాను హైవేపై దాబా దగ్గర ఉన్నాను.. రమ్మన్నట్టుగా పండు సమాధానం చెప్పాడు. అక్కడే ఉండూ వస్తున్నా.. అంటూ సందీప్‌ అనడంతో ఫోన్‌ సంభాషణ ముగిసింది. పటమట, పెనమలూరు ప్రాంతాలకే కాకుండా.. నగరంలోని అన్ని ప్రాంతాల్లో గ్యాంగ్‌లు ఏమైనా ఉంటే గుర్తించాలని కమిషనర్‌ పోలీసులకు సూచించారు. గంజాయ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌లపై దృష్టిపెట్టాలన్నారు.

ఇదీ చదవండి: బెజవాడ గ్యాంగ్​ వార్​పై లోతైన దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.