ETV Bharat / city

'విశాఖ ఘటనపై చంద్రబాబు ట్వీట్​ అవాస్తవం' - చంద్రబాబు ట్వీట్​కు పోలీసుల కౌంటర్

విశాఖలో పోలీసులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ట్వీట్​పై పోలీసులు స్పందించారు. ఆటో తగిలి కింద పడిపోయిన తమకు రమేష్ అనే నిరసనకారుడు సాయం చేశాడని సీఐ ఇమ్మాన్యుల్ రాజు చెప్పారు. అవాస్తవాలను ప్రచారం చేయటం సరికాదన్నారు. ఈ ఘటనపై ఫొటోలతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు.

'విశాఖ ఘటనపై చంద్రబాబు ట్వీట్​ అవాస్తవం'

author img

By

Published : Dec 19, 2020, 7:30 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో పోలీసులపై వైకాపా నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ తెదేపా అధినేత చంద్రబాబు చేసిన ట్వీట్​లో వాస్తవం లేదంటూ పోలీసులు తెలిపారు. శుక్రవారం వైకాపా నేతలు చేపట్టిన ర్యాలీలో భాగంగా నిరసనకారులను అడ్డుకునే క్రమంలో ఆటో తగిలి కింద పడిపోయానని ఆరిలోవ పోలీసు స్టేషన్ సీఐ ఇమ్మాన్యుల్ రాజు తెలిపారు.

ఆ సమయంలో నిరసనకారుడు రమేష్ వచ్చి తనకు సహాయం చేశాడన్నారు. కానీ కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయటాన్ని తప్పుబట్టారు. ఈ ఘటనపై ఫొటోలతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఇటువంటి చర్యల వల్ల పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు.

అనుబంధ కథనం: సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.