Free Training For Police Job Aspirants: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు పోటీపడుతున్న యువతకు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఇచ్చే ఉచిత శిక్షణకు పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఉద్యోగాలకు ఎంపికయ్యేలా శారీరక దారుఢ్య (ఫిజికల్ ఫిట్‌నెస్) పరీక్షల్లో పాటించాల్సిన మెలకువలు, సన్నద్ధత తదితర అంశాలపై అభ్యర్థులకు సీనియర్ శిక్షకులతో సలహాలు, సూచనలు ఇప్పించనున్నాయి. దీని కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాయగా.. వారు అంగీకరించారు. ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో 18 వేల పోస్టులు పోలీసు శాఖలోనే ఉన్నాయి.
ఈ శాఖలో ఉద్యోగాలకు ఎంపికవ్వడానికి రాత పరీక్షల్లో ప్రతిభ చూపడంతో పాటు శారీరక దారుఢ్యం అవసరం. ఇందుకోసం పోలీసు శాఖలోని సీనియర్ శిక్షకులతో తొలుత గురుకులాల్లోని పీఈటీలకు మెలకువలపై అవగాహన కల్పించి సూచనలు ఇవ్వనున్నారు. ఆ తరవాత రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని స్టడీ సర్కిళ్ల ద్వారా పీఈటీలతో అభ్యర్థులకు శిక్షణ ఇప్పిస్తారు.
ఇవీ చదవండి: వైభవంగా రామోజీరావు మనవరాలి వివాహం.. తరలివచ్చిన అతిరథ మహారథులు
'కేసీఆర్ వద్దంటేనే వరి వేయలేదు'.. తన భూమి వద్ద ఫ్లైక్సీతో రైతు నిరసన
'కేంద్రం నిధులిస్తుంటే ఫొటోలు, పేర్లు మార్చి తెరాస ప్రజలను ఏమార్చుతోంది'